Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RAINS: హైదరాబాద్ లో మళ్ళీ జోరువానలు

–పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం
–రోడ్లపై మోకాళ్లలోతు నిలిచిన నీరు
–డబీరురా, సర్దార్ మహల్లో 7 సెం.మీ
— రెండు రోజుల పాటు నగరానికి వర్ష సూచన పలు జిల్లాల్లో మోస్తరు వాన

RAINS: : ప్రజా దీవెన, హైదరాబాద్: రోజంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం నాలుగు అయ్యే సరికి అకస్మాత్తుగా మారిపోయింది. ఉన్న ట్టుండి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లుల తో మొదలై కొద్దిసేపటికే వాన జోరందుకుంది. ఒకటీ రెండు ప్రాంతాల్లో ఆరంభమై.. నిమిషాల వ్యవధిలోనే నగరమంతా విస్తరిం చింది. హైదరాబాద్ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులపై (On major roads)మోకాళ్లలోతు వరద నిలిచి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.హైదరాబాద్ సిటీ, జూన్ 23 : రాత్రి 8 గంటల వరకు డబీరురాలో అత్యధికంగా 7.1 సెం.మీ, సర్దార్ మహల్లో 7 సెం.మీ వర్షం కురిసింది. అసిఫనగర్, గౌలిగూడ, బేగంబజార్ ప్రాంతాల్లో 6 సెం.మీ.కు పైగా.. నాంపల్లి,లంగర్ హౌస్, అజంపురా, దూద్ బౌలి, విజయనగర్ కాలనీ, అంబర్పేటలో 5 సెం.మీ.కు పైగా.. హయత్నగర్, నెహ్రూనగర్, ఎన్టీవోసకాలనీ, కిషన్బాగ్లో 4 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది.

వనస్థలిపురంలో (Vanasthalipuram)హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు భారీగా నిలిచిపోవడం తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మెహిదీపట్నం 11 కేవీ సాయిగార్డెన్ ఫీడర్ పరిధిలో భారీ వృక్షం పడటంతో విద్యుత్ తీగలు తెగిపోయి స్తంభం విరిగిపడింది. ఎర్రగడ్డ స్వర్ణ జయంతి (Erragadda Golden Jubilee) ఫీడర్ పరిధిలో చెట్టు విరిగి కరెంటు తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విపత్తు నిర్వహణ బృందాలు పలు ప్రాంతాల్లో వరద నీటిని తొలగించాయి. కాగా, హైదరాబాద్లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. సోమ, మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు యెల్లో హెచ్చరిక జారీచేశారు.

పలు జిల్లాల్లో మోస్తరు వాన..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వాన కురిసింది. నిర్మల్ జిల్లాలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు (RAINS) కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టుకు 2,900 క్యూసెక్కుల వరద వస్తోంది. యాదగిరిగుట్టలో సాయంత్రం అరగంట పాటు జోరు వాన పడింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వాన కురిసింది. వాంకిడి మండలంలో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాగజ్నగర్ మండలం అందవెల్లిలో పెద్ద వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో భీమిని, దహెగాం మండలాలకు చెందిన 50 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వాన కురిసింది.