Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: డ్రగ్స్ రహిత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

–డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది
–మాలక ద్రవ్యాల విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్ణయాలకు సిద్ధం
–డ్రగ్స్ నిర్మూలన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క

Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: డ్రగ్స్ రహిత (drugs free)తెలంగాణ రాష్ట్ర నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోం దని వ్యాఖ్యానించారు. మాదకద్ర వ్యాల నిర్మూలన విషయంలో ఏ స్థా యిలో అయినా నిర్ణయాలు తీసుకు నేందుకు సిద్ధంగా ఉన్నామని స్ప ష్టం చేశారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో (HYDERABAD NECKLACE ROAD) జలవిహార్‌ వద్ద డ్రగ్స్‌ ని ర్మూలన ర్యాలీని ఆయన ప్రారం భించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇంది రమ్మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మాదకద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించమని, ఉ క్కు పాదంతో అణచివేస్తామన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కనబడ డానికి వీలులేదని సీఎం రేవంత్ రె డ్డి, మంత్రులు కఠిన నిర్ణయం తీసు కొని ముందుకు వెళ్తున్నామని చె ప్పారు. రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు (Drug prevention) ఎన్ని నిధులైన కేటాయిస్తామని బడ్జెట్ సమస్య అంటూ ఉత్పన్నమయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

దేశ భవి ష్య త్తుకు ఉపయోగపడే యువత ను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్సును సమూ లంగా నివారించడం మనం దరి బా ధ్యత అని, తెలంగాణ పోలీస్ వ్యవస్థ (Telangana Police System) చాలా బలమైనది, తెలివైనది ఎంత దూరం వెళ్లినా నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు కలదo టూ పోలీసులు వేసే ప్రతి అడుగు మనకోసమే అన్న భావనను పెం పొందించుకొని పోలీసులకు సహక రించాలని పేర్కొన్నారు. సంఘవిద్రో హ శక్తులు, అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడానికి కొందరు దుర్మా ర్గులు అలవాటు చేసే డ్రగ్స్ ఉచ్చు లో పడి యువత బంగారు భవిష్య త్తును కోల్పోవద్దని, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సూచించా రు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగాలని, ఈ ప్రభు త్వం విద్యకు పెద్దపీట వేస్తున్నద న్నారు.డ్రగ్స్‌ వినియోగం విష ప్ర యోగం లాంటిదని, ఇది అత్యంత ప్రమాదకరమని వెచ్చరించారు. కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందని, డ్రగ్స్‌ సరఫరా (drugs supply)చేస్తున్న సంఘ విద్రోహశక్తుల చేతిలో యువ త జీవితాలు చిన్నాభిన్నమవుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల నుంచి వస్తున్న ప్రతి పైసను సద్వినియోగం చేస్తూ ఈ ప్రభుత్వం విద్యకు ఎక్కువ మొత్తంలో వెచ్చిం చి మీ బంగారు భవిష్యత్తుకు తోడ్ప డుతున్నదని, తాత్కాలిక వ్యసనా లకు మీరు నష్టపోతే మీ తల్లిదండ్రు లతో పాటు ఈ సమాజం బాధపడు తుందన్న విషయాన్ని మర్చిపోవ ద్దని, విద్యార్థులు యువత మంచి సహవాసంతో నడిచి భవిష్యత్తును మార్గదర్శనం చేసుకోవాలని, ప్రశాం తంగా ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో డ్రగ్స్ విష ప్ర యోగం లాంటిదని, భారతదేశ సమాజబలమే కుటుంబ వ్యవస్థ అలాంటి కుటుంబ వ్యవస్థకే ఇది చాలా ప్రమాదకరంగా మారింద న్నారు. దేశానికి బలీయమైన మా నవ వనరులను నిర్వీర్యం చేయా లని దేశ ద్రోహులు చేసే కుట్రలో అంతర్భాగమే మాదక ద్రవ్యాల రవాణా అని అన్ని గ్రామాల్లో మాద కద్రవ్యాల నిరోధక కమిటీలు వేసి పోలీసులు (polices) సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం పెద్ద సమస్య ఏమి కాదని వ్యాఖ్యానించారు.