–2011నాటి రైల్ రోకో కేసును కొట్టెయాలంటూ పిటిషన్
–సదరు కేసు పై స్టే విధిస్తూ జూలై 18వ తేదీకి హైకోర్టు వాయిదా
KCR:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఉద్యమం సమయంలో 20 11న తనపై నమోదైన రైలు రోకో కేసును (A case of train stoppage) కొట్టివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో (In Telangana State High Court) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (kcr) ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయిం చారు. ఆ క్రమంలో ఈ కేసు విచా రణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2011, అక్టోబర్‌లో నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr)రైలు రోకోకను పిలుపునిచ్చారంటూ మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. అలాగే పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యో గుల (Railway industry)విధులకు ఆయన ఆటంకం కలిగించినట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తాను ఎలాంటి రైలు రోకోను పిలుపు ఇవ్వలేదన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం మేరకు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. ఇక ఈ రైలు రోకో ఘటన చోటుచేసుకున్న మూ డేళ్లకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి బలం ఉండని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. అందులోభాగంగా తెలం గాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేసీఆర్ (kcr) తన వాదనను స్పష్టం చేశారు. దాంతో మంగళవా రం వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు ను జులై 18వ తేదీకి వాయిదా వేసింది.