–ఐద్వాజిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
Government Hospital: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మాతా శిశు సంరక్షణ (Maternal Child Care) కేంద్రంలో తీవ్రమైన డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, మంచినీటి సౌకర్యం, ఓపి సేవలు పెంచడం, వెంటనే చేయా లని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati)డిమాండ్ (demand)చేశారు. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో సర్వే నిర్వహిం చడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల వార్డులో మందుల కొరత ఏమీ లేదని, ప్రతిరోజు 350 మంది వరకు ఓపికి వస్తున్నారని కేవలం ముగ్గురు డాక్టర్లు (docters)చూడడం వలన సమయం లేక గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంచినీటి సౌకర్యం కు అదనంగా నీటి ట్యాంకర్ ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలు వృద్ధులు, వికలాంగులకు ఒకటే వరుస లైన్ ఓపి (op) ఉండటం వలన మరియు గాలి వెలుతురు లేకపోవడం వలన కళ్ళు తిరిగి కిందపడిన సంఘటనలు జరిగాయని రోగులు తెలియ జేశారు. నర్సుల సిబ్బంది కొరత ఉన్నదని అన్నారు. గతంలో ఇచ్చిన తల్లి పిల్లలకు కిట్ ఇవ్వడం లేదని అన్నారు. రోగులకు పెట్టే ఆహారము నాణ్యతగా లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగు పరిశీలన జరిపి సమస్యలను తక్షణమే పరిష్కారము చేయుటకు చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేస్తున్నది. సర్వే కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.