–మాదకద్రవ్యాలకు బానిసత్వం తో యువత జీవితాన్ని కోల్పోతుంది
— ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాను మాదకద్ర వ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డి (Narayana Reddy) అన్నారు. ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యం లో నల్గొండ (NALGONDA)పట్టణంలో మాదకద్ర వ్యాలకు యువత బానిసై జీవితా లను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై అవగాహన ర్యాలీ నిర్వ హించడం జరిగింది. జిల్లా కేం ద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ (Clock Tower from Ng College) వరకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారా యణ రెడ్డి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారం భించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు, లైన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, 12 బెటాలియన్ పోలీసులు, పి ఈ టి అసోసియేషన్ సభ్యులతోపాటు, నల్గొండ పట్టణ పుర ప్రముఖులు, జిల్లా పరిషత్, ఐసిడిఎస్, డి ఆర్ డి ఏ, గిరిజన అభివృద్ధి శాఖ లకు చెందిన అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ఈ ర్యాలీ “డ్రగ్స్ ను నిర్మూలిద్దాం యువతను కాపాడుదాం “, “డ్రగ్స్ వద్దు జీవితం వద్దు “, “డ్రగ్స్ ను పక్కన పెట్టు జీవితాన్ని గాడిలో పెట్టు” అనే నినాదాలతో సాగింది.
క్లాక్ టవర్ వఫండ (Clock Tower Wafanda)ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి (NARAYANA REDDY) మాట్లాడుతూ మనిషి జీవితం లో 15 నుండి 35 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైన దని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదకద్రవ్యాలకు బానిస కావటం వల్ల జీవితం నాశ నం అవుతుందని అన్నారు. ఆలో చన మందగించే ఏదైనా విషంతో సమానమని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదకద్ర వ్యాలకు అలవాటు కావద్దని, ఒకవేళ వాటికి బానిస అవుతే జీవితానికి అర్థమే ఉండదని అన్నారు. యువత కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు. జిల్లాలో మత్తుమందులు (Narcotics) అన్నవి కనపడకూడదని చెప్పారు. ఇందుకుగానుఅన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపుని చ్చారు. ప్రస్తుత తీరికలేని జీవితంలో తమ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగు తున్నారనే విషయాలపై తల్లి దండ్రులు శుద్ధ చూపడం లేదని, దీంతో కొన్ని మాధ్యమాల ద్వారా పిల్లలు చెడు వైపుకు వెళ్తూ మత్తుకు బానిస అవుతున్నారని, పిల్లలు ఏం చేస్తున్నారో రోజువారి పరిశీలన చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని గుర్తు చేశారు. పిల్లలు మత్తుకు బానిస కాకుండా మొదట తల్లిదండ్రుల్లో అవగాహనరావాలని అన్నారు. పర్యవేక్షణచేయకపోవడం వల్లే పిల్లలు చెడు వైపు చూస్తున్నారని, అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవి తాలను నాశనం చేసుకుంటు న్నారని, మదకద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు ఎక్క డున్నాయనే వాటి పైన ఉక్కు పాదం మోపు తామన్నారు. మాదకద్ర వ్యాలు అనేవి పెద్ద ట్రాప్ అని, వాటికోసం యువత ప్రయత్నించకూడదని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు అమ్మిన, సరఫరా చేసిన వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలని, మాదకద్రవ్యాలు అమ్మిన, సప్లై చేసిన ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. చదువుకునే యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ దీప్తి, విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్,జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, ఐసిడిఎస్ పిడి సక్కుబాయి, నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ,ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అమరెందర్ రెడ్డి,లయన్స్ క్లబ్ చైర్మన్ కె.వి.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.