–ప్రమాదంలో మృతి చెందిన షేక్ నజీర్ కుటుంబానికి రూ. లక్ష సాయం
–కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా కుటుంబానికి అందజేత
Minister Komati Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy) మరోసారి మానవత్వం (Humanity) చాటుకు న్నారు. ప్రమాదంలో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించా రు. కనగల్ మండలం ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన షేక్ నజీర్ రాయి పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రాయి మీద పడి ఈ నెల 24న మృతి చెందాడు.మృతునికి మూగ భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
ఈ విషయం కాంగ్రెస్ పార్టీ (Congress party) శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందిం చి మంత్రి లక్ష రూపాయలను ఆ కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. దీంతో కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు కూసు కుంట్ల రాజిరెడ్డి, చర్లగౌరారం మాజీ సర్పంచ్ వెంకన్న తదితరులు బుధ వారం మృతుడు షేక్ నజీర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను (FAMILY MEMBERS) పరామ ర్శించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించిన రూ.1లక్ష నగదును మృతుని భార్యకు అందజేశారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకరాజు శ్రీను, శ్రీశైలం, దొడ్డి సైదులు, మురళి, ఇస్లాంనగర్ గ్రామ పెద్దలు, ఖాదర్, షబ్బీర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పాల్గొన్నారు.