Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Om Birla: లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా

–ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి
–వాయిస్ ఓటుతో ఓంబిర్లా స్పీకర్‌ గా ఎన్నికైనట్లు ప్రకటన

Om Birla: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక (Election of Speaker of Lok Sabha) సుఖాంతమైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగు తుందని అందరూ భావించిన ప్పటికీ స్పీకర్‌గా ఓంబిర్లా (Om Birla) ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పద విని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ (BJP)చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో స్పీకర్ పదవి కోసం ఎన్నికలు అనివార్యం కాక రెండు నామినేష న్లు దాఖలయ్యాయి. ఎన్డీయే కూట మి తరపున బీజేపీ నుంచి ఓం బి ర్లా, కాంగ్రెస్ (CONGRESS) నుంచి సురేష్ కొడి కు న్నిల్ నామినేషన్ దాఖలు చేయడం తో ఎన్నిక అనివార్య మైంది. దీంతో 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో (first sessions of the Lok Sabha) భాగంగా మూడోరోజు సభ ప్రారం భం కాగానే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఘటాల్ ఎంపీ అధికారి దీపక్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత స్పీకర్ ఎన్ని కను ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌ (Bhartrihari Mahatab) నిర్వహించారు.స్పీకర్ పదవి కోసం ఓం బిర్లాను ప్రతిపాదిస్తున్న ట్లు ప్రధాని నరేంద్రమోదీ (MODI)తీర్మా నం ప్రవేశపెట్టారు. ఈ తీర్మా నాన్ని ఎన్డీయే పక్ష నేతలు సమర్థించారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాది స్తున్నట్లు తెలిపారు. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఓంబి ర్లా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుడికొన్నల్ అభ్యర్థిత్వాన్ని ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఎంపీ అర వింద్ గణపతి సావంత్ ప్రతిపా దించారు. సురేష్ అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి (Alliance of India) పక్షాలు సమ ర్థించాయి.

అయితే ఓంబిర్లాను ప్రతిపాదిస్తూ మోదీ (MODI) ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎక్కువ మంది సభ్యు లు మద్దతు ఉన్నట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వాయిస్ ఓటుతో ఓంబిర్లా (OM BIRLA) స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.ఇండియా కూటమి తరపున డివిజన్ అడిగినప్పటికీ అప్పటికే స్పీకర్ ఎన్నిక పూర్తైందని ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారని ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తీసుకురావాల్సిందిగా అధికార, ప్రతిపక్షాలను కోరారు. దీంతో ఓంబిర్లా స్పీకర్ స్థానంలో ఆశీ నుల య్యారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓంబిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ కరచాలనం చేశా రు.లోక్‌సభ స్పీకర్ పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలు కావ డంతో ఎన్నిక జరుగు తుందని అంతా భావించారు. కానీ ప్రొటెం స్పీకర్ వాయిస్ ఓటుతో స్పీకర్ ఎన్నికను ముగించడంతో ఓంబిర్లా ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నిక య్యారు. ఇండియా కూటమి ఓటింగ్ కోరినప్పటికీ అప్పటికే ఎన్నిక పూర్తైందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో ఎన్నిక లేకుండానే ఓంబిర్లా (OM BIRLA)స్పీకర్‌గా ఎన్నికయ్యారు