–మాజీమంత్రి హరీష్ రావు మద్దతు
Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్ : గురుకుల అభ్యర్థుల నిరసనకు (Protest of gurukula candidates) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరి ష్కరిం చాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వా నికి గురుకుల టీచర్ పోస్టుల అభ్య ర్థుల బాధలు కనిపిం చకపోవడం బాధాకరం అని హరీశ్ రావు (harish rao)అన్నా రు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశా రు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్య ర్థించినా అభ్యర్థుల మొర అలకిం చకపోవడం శోచనీయమని పేర్కొ న్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల (Weaker sections)పిల్లలకు అత్యున్నత, నాణ్యమైన రెసిడెన్షియల్‌తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ (brs)ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురు కులాలు ఏర్పాటు చేసింది అని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇది ఇలా ఉంటే తమ ఉద్యోగాలు ఇప్పించండి అంటూ పెద్దమ్మ గుడి ముందు గురుకుల అభ్యర్థులు భిక్షాటన చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద లేకపోవడంతో ఆయన ఢిల్లీలో ఉండటంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు ( gurukula candidates) మోకాళ్ళ మీద కూర్చొని కొంగు పట్టి చాచి అడుక్కున్నారు.