–ఓ హోటల్ లో అరెస్టు చేసి ఎస్పీ ఆఫీస్ కు తరలింపు
–ముందస్తు బెయిల్ పొడగించాలం టూ పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో అరదండాలు
Pinnelli Ramakrishna Reddy: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమ యంలో ఈవీఎం పగలగొట్టిన మా చర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ (ARREST) అయి ఇoత కాలం ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) పోలీస్ చేతికి చిక్కారు. తన ముందస్తు బెయిల్ ను (BAIL)మరింత కాలం పొడగించా లంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్‌లో బసచేసిన ఆయనను అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు.కాగా పిన్నెల్లిపై ఈవీ ఎం ధ్వంసంతో పాటు రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈవీఎం ధ్వంసానికి (To destroy the EVM) సంబంధించి మరో కేసు కూడా ఆయనపై ఉంది. ఎన్నికల అల్లర్లకు సంబంధించి ఈ కేసులు నమోదయింది. ఈవీఎంల ను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు CASE) నమోదయింది.
కారంపూడిలో దాడి కేసులో సీఐ (CI) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదయిం ది. ఇవి కాకుండా ఈవీఎంను (EVMS) ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదయింది. మొత్తం నాలు గు కేసులు ఆయనపై ఉన్నాయి. నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు (Petitions) వేశారు. గతంలో ఎన్నికల కౌంటిం గ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయి తే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయి ల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై (On Pinnelli’s petitions) గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలు వరింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం అరెస్ట్ చేశారని తెలుస్తోంది.కాగా ఏపీ అసెం బ్లీ ఎన్నికల (AP Assembly Elections) సందర్భంగా పాల్వా యి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేశారు. దీంతో ఆయనపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు మూడు ఘటనల్లో ఆయనపై హత్యాయ త్నం కేసులు నమోదయాయి. అయితే అరెస్ట్ కాకుండా ఉండేందు కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముంద స్తు బెయిల్ పొందారు. ఓట్ల లెక్కిం పు తర్వాత జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాస నం పోలీసులకు ఆదేశించింది. ఆ తర్వాత కూడా పొడగింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న ముం దస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.