–ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థు లను మంచి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలి
–పాఠశాల ద్వారా క్రమశిక్షణను అలవాటు చేయాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం (Collector’s Office) నుండి విద్యా శాఖ కార్యక్రమాలపై (Education Department) విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని, రెండవ జత నాణ్యత తో ఒక పద్ధతి ప్రకారం స్వయం సహాయక సంఘాలు అప్పగించా లని అన్నారు. హెడ్మాస్టర్లు గ్రామ స్థాయిలో గ్రామపంచాయతీ బృందంతో కలిసి పని చేయాలని ఆదేశించారు.
ఉపాధ్యాయులు ,విద్యార్థుల హాజరు విద్యశాఖ సమీక్ష (Education department review of teacher and student attendance) లో మొదటి అంశంగా తీసుకోవడం జరుగుతుందని, అందువల్ల ఉపా ధ్యాయులు పాఠశాలలకు నిర్దేశిం చిన సమయం ప్రకారం హాజరుకా వాలని, ముందస్తు సెలవు లేకుండా ఎట్టి పరిస్థితులలో విధులకు గైర్హా జరు కావద్దని ఒకవేళ గైర్హాజరైతే సస్పెండ్ (Suspended in case of absence) చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయులు పాఠశాల కు ఆలస్యంగా వచ్చిన, లేదా పాఠశాల సమయానికంటే ముందే వెళ్లిపోయినా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులదే బాధ్యతని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో భాగంగా పనుల కోసం అడ్వాన్సులు సైతం ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై అందరూ హెడ్మాస్టర్లు, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు ,అమ్మ ఆదర్శ పాఠశాలకమిటీలు దృష్టి సారించి జూలై 1 నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నా రు. ప్రతి పాఠశాలలో క్రమశిక్షణ పెంపొందించేలా విద్యార్థులను తయారు చేయాలని, భవిష్యత్తులో పిల్లలు మంచి స్థానంలో ఉండేలా టీచర్లు (TEACHERS)కృషి చేయాలని అన్నారు.
విద్యార్థుల ఫలితాలే ఉపాధ్యా యుల పనితీరుకు గీటురాయి అని,ప్రత్యేకించి జిల్లాలో పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేం దుకు కృషి చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో పరీక్షల సందర్భంగా తప్పులు జరగకుండా చూసు కోవాలని ,హెడ్ మాస్టర్లు (HEAD MASTERS)వారి పరిధిలో కాంప్లెక్స్ మీటింగ్ లు ఏర్పాటుచేసి స్పష్టంగా తెలియజే యాలని అన్నారు పాఠశాల యూనిఫాంలలో (School uniform) భాగంగా రెండవ విడత ఇచ్చే యూనిఫామ్ సైతం పిల్లలకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు, పాఠశాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ అన్ని పరిశీలించి ఏవైనా చిన్న చిన్న లోపాలున్నట్లయితే సరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు ఆదేశించారు.స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర (Additional Collector T. Poorna Chandra) మాట్లాడు తూ జూలై 1 నాటికి అమ్మ ఆదర్శపాఠశాల పనుల న్నిటిని పూర్తిచేయాలని, పాఠశాల లకు సంబంధించిన ఆస్తులను సంరక్షింక్షే బాధ్యత హెడ్మాస్టర్ లపై ఉందని తెలిపారు.జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిపి ఓ మురళి, మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, టీఎస్ ఎం ఐ డి సి ఇంజనీర్లు, జిల్లా కేంద్రంలో హాజరుకాగా, అన్ని మండలాల నుండి ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.