— కెసీఆర్ సార్ కు ఒక్కసారే మైండ్ బ్లాక్ అయ్యిందేమో
–ప్రభుత్వాన్ని కూలుస్తామని నోటికొ చ్చినట్లు వాడితే ఊరుకోవాలా
— లోక్‌సభ ఫలితాలతోనైనా కేసీఆర్ కు కనువిప్పు కలుగుతుందనుకున్న
–విద్యుత్తు కొనుగోళ్లపై కమిషన్ వే యాలని జగదీశ్‌రెడ్డే కదా అడిగింది
–మాటమీద ఉండి కేసీఆర్‌ను విచా రణకు పిలిస్తే విమర్శలెందుకు
–గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగా ణలో ఇప్పటివరకైతే లేవుగా
–క్యాబినెట్ విస్తరణపై వాస్తవానికి చర్చలoటూ జరగలేదు
–ప్రభుత్వ సుస్థిరతకు ఇతరుల చేరి కలు అవసరం కాబట్టే
–పుంజుకునేందుకు కేసీఆర్‌కు అవ కాశాలున్నoదున అసెంబ్లీకొచ్చి ఉనికి చాటుకోవాలి
–ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
Revanth Reddy: ప్రజా దీవెన,న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీఆర్‌ఎస్ (brs), బీజే పీలు నడిరోడ్లపై రంకెలేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్ (brs)పార్టీ లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి 16 శాతానికి పడిపోయిందని, మొత్తం 17 సీట్ల లోనూ ఓడిపోవడమే కాకుండా 8 సీట్లలో డిపాజిట్లు (Deposits) కోల్పోయిందని, 14 స్థానాల్లో మూడో స్థానానికి పడి పోయిందని, అయినప్పటికి కేసీఆర్‌కు కనువిప్పుకలగలేదని దుయ్య బట్టారు. పైగా, ప్రజలదే తప్పు అన్న ట్లు మాట్లాడుతున్నారని విమర్శిం చారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవ హారంలో కేసీఆర్ తీరు చూ స్తుంటే కేసీఆర్‌కు (kcr) మైండ్ బ్లాక్ అ యిందని ఎద్దేవా చేశారు. వాస్తవా నికి ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని తన అధికా రిక నివా సంలో గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసు కున్నారని గుర్తు చేశారు.
తాను చేసి న తప్పులకు క్షమించాలంటూ అమ రవీరుల స్తూపం దగ్గర కు వచ్చి ము క్కు మూడించులు అరిగేలా నేలకు రాయాలని కేసీఆ ర్‌ను (kcr) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు కూడా మనుగడ సాగిం చదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అనగా అందుకు బీజేపీ వంతపా డిందని కేవలం కాంగ్రెస్‌ను ఓడిం చేందుకు బీఆర్‌ఎస్ నేతలు (BRS leaders) తమ ఓట్లను బీజేపీకి గంపగుత్తగా వేశా రని ఆరోపించారు. లేకపోతే కేటీ ఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీకి ఫస్టు ప్లేసు వస్తుందా, సిద్దిపేటలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు సమానంగా ఓట్లు వస్తాయా, బీఆర్ ఎస్ కంచుకోట మెదక్‌లో బీజేపీకి (bjp)మెజారిటీ వస్తుందా అని నిలదీ శారు. కేసీఆర్‌కు ఇప్పటికైనా కనువి ప్పు కలగాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. నిన్నటి వరకూ గేటు దగ్గరకు కూడా రానివ్వని ఎ మ్మెల్యేలను ఇప్పుడు పిలిచి భోజ నాలు పెట్టే పరిస్థితి కేసీఆర్‌కు తలె త్తిందని, తలుపులు మూసి కాళ్లు పట్టకుంటుండో, కడుపులో తలకా య పెడుతుండో తనకు తెలియద ని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయ కుడిగా అసెంబ్లీకి రమ్మన్నా రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సైతం రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటాడు, దేశంలో ఎక్కడైనా ఈ సంప్ర దాయం ఉందా, గత పదేళ్లలో ఎప్పుడైనా మమ్మల్ని పిలిచాడా పదేళ్లు సీఎంగా పని చేసినందున సముచిత గౌరవంతో ఆహ్వా నించామని, కేసీఆర్‌కు ఉద్యమ స్ఫూర్తి ఉంటే మేం పిలిచినప్పుడు హుందాగా వచ్చి అవతరణ వేడు కల్లో పాల్గొని ఉండేవాడని, సంబరా ల్లో పాల్గొననివాడు ప్రజలు ఎన్నుకు న్న ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకున్నవాడు తెలంగాణ బాగు ను ఎలా కోరుకుంటాడని నిలదీశా రు. స్వార్థం, దోపిడీ, తన కుటుం బానికే అన్నీ ఉండాలన్న కోరిక ఇవ న్నీ ఎల్లకాలం కేసీఆర్‌ను (kcr)బతికించ వని మండిపడ్డారు.
విద్యుత్తు కమిష న్‌ను డిమాండ్ (demand) చేసింది జగదీశ్ రెడ్డే (Jagdish Redde)… విద్యు త్తు కొనుగోళ్లపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని తాము ప్రతిపా దించలేదని, బీఆర్‌ఎస్ మాజీ మం త్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో సవాల్ విసిరి మరీ విచారణకు డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కమిషన్‌ను ఏర్పాటు చేసి న మూడు నెలల వరకూ టీఆర్‌ఎ స్, కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు. కేసీ ఆర్‌ను వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. విచారణ కమిషన్ వేయడం తప్పా, కేసీఆర్ ను వివరణ ఇవ్వాలని అడిగినందు కు తప్పు పడుతున్నారా,జస్టిస్ నర్సింహా రెడ్డిని తప్పు పడుతున్నా రా, బీఆర్‌ఎస్ నేతల మాటల్లోనే వ్యత్యాసం ఉందని గుర్తు చేశారు. వాళ్లలో వాళ్లకే సమన్వయం లేదని, అని ఎద్దేవా చేశారు. వాళ్లు డిమాం డ్ చేస్తేనే విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, అవకాశం వచ్చి నప్పుడు ఒకరు శ్రీరామ చంద్రుడు, మరొకరు సత్య హరి శ్చంద్రుడు అని నిరూపిం చుకుంటే సరిపోతుంది కదా అని వ్యాఖ్యా నించారు. జస్టిస్ నర్సింహా రెడ్డి (Narsimha Reddy) కమిషన్లో లోపాలు ఏమైనా ఉంటే విచారణకు వెళ్లి కేసీఆర్ తన అను భవాన్ని ఉపయోగించుకుని అద్భు తంగా వాదించుకోవచ్చు కదా అని అన్నారు. కేసీఆర్ కోరుకుంటే లైవ్ టెలికాస్ట్‌కు ప్రభుత్వం కూడా కమిష న్‌కు విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటి వరకు చర్చలు జరగలేదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు ప్రమాణ స్వీకారాలకు కూడా ముహూర్తాలు పెట్టేశాయి’’ అని సీఎం రేవంత్ (cm revanth reddy)ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నడిచే మీడియా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మం త్రులు లేరని వార్తలు రాస్తున్నాయ ని, కానీ, కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత కొన్ని నెలల పాటు మంత్రులే లేరని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అన్ని శాఖలకు మంత్రులున్నారని, సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. వచ్చే నెల ఏడో తేదీతో పీసీసీ చీఫ్‌గా తన పదవీ కాలం ముగుస్తోందని, ఆలోపే సామాజిక న్యాయంతోపాటు సమర్థంగా పార్టీ ని నడిపించే వ్యక్తిని నియమించాల ని పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణు గోపాల్‌ను కోరినట్లు రేవంత్ తెలి పారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుతో జగిత్యాల ఎమ్మెల్యే సం జయ్ (sanjay) మా సర్కారుకు సహకరించా లని నిర్ణయించుకున్నారు. ఆయన చేరికతో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ తరపున తీసు కోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంత గందర గోళ పరిస్థితి ఏర్పడింది. మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని సంప్రదిం చి అధిష్ఠానానికి హుటాహుటిన వివరాలు అందజేసి ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు నష్టం జరగకుండా చర్య లు తీసుకున్నారు. అధిష్ఠానం కూ డా జీవన్‌రెడ్డి కమిట్‌మెంట్‌ను దృష్టి లో పెట్టుకుని ఆయన గౌరవాని కి భంగం కలగకుండా చూస్తామని మాట ఇచ్చింది. ఆయన గౌరవాన్ని కాపాడడంతోపాటు కార్యకర్తలను ఆదుకోవాలని పార్టీ ఆదేశించింది. దానికి మేం కట్టుబడి ఉంటామని వివరించారు.
పక్క రాష్ట్రాల్లోలా రాజకీయ కేసులుండవు… తెలంగాణలో ఇప్పటి వరకూ ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు కాలేదు. గతంలో పక్క రాష్ట్రాల్లో జరిగినట్లు మా పాలనలో ఉండవు. చిన్న కేసు కూడా నమోదు కాలేదంటే మా పా లన బాగున్నట్లా, బాగా లేనట్లా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిం చారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి నిధులు, అనుమతు లతో సహా ఏపీతో ఉన్న సమస్యల ను పరిష్కరించుకుంటామని, ఏపీ సర్కారుతో చర్చల పట్ల తమ ప్రభు త్వానికి ఎటువంటి భేషజాలు లేవ ని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్ర బాబుతో వీలైన మేరకు సమస్యల ను సానుకూలంగా పరిష్కరించు కుంటామని తెలిపారు. కేంద్రం వల్ల కూడా కాకపోతే సమస్యల పరి ష్కా రానికి కోర్టులున్నాయి. ఇరు రాష్ట్రా ల సమస్యల పరిష్కారానికి వివిధ వేదికలను ఉపయోగించుకుంటాం. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడే అవకాశాలు లేవని, మా రాష్ట్ర అభివృద్ధి కోసం అలస త్వం ప్రదర్శించమని రేవంత్ వ్యా ఖ్యానించారు. రోజుకూ 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ పునర్నిర్మా ణాన్ని పూర్తి చేస్తామన్నారు. తనకు ఫాంహౌజ్‌లలో పడుకునే అలవా టు లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో చర్చలు సాను కూలంగా జరిగాయని, కంటోన్మెం ట్‌లో 25 ఏళ్లుగా పెండింగులో ఉన్న ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతు లు తీసుకున్నామని, నిధులు విడు దల చేయించుకున్నామని, త్వర లోనే ప్రధానిని, హోం మంత్రిని కలవ నున్నామని తెలిపారు.