Govt Teacher: ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణహత్య
ఆదిలా బాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యా యుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది.
ప్రజా దీవెన, అదిలాబాద్ : ఆదిలా బాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యా యుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. బుధ వారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో జైనథ్ మండలం మేడి గూడ విధులకు తొలి రోజు హాజర య్యేందుకు మోటార్ బైక్ పై వెళ్తు న్న ఉపాధ్యాయుడు గజేందర్ ను గుర్తు తెలియని వ్యక్తులు నార్నూర్ మండలం అర్జుని లోకారి వద్ద అడ్డ గించి హతమార్చారు.తన స్వగ్రా మం నాగలకోయ నుండి బైక్ పై బయలుదేరిన ఉపాధ్యాయున్ని గుర్తు తెలియని వ్యక్తులు దారిలో కాపు కాచి బండరాళ్లతో తలపై కొట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. గజేం దర్ ఆదిలాబాద్ లోని శ్రీనగర్ కాల నీలో నివాసం ఉంటున్నట్టు తెలి సింది. కుటుంబ తగాదాల కారణం గా ఈ హత్య జరిగి ఉంటుందేమో నని అనుమానిస్తున్నారు. పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు జరుపుతున్నారు.
Adilabad Zainath Mandal Mediguda