Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth reddy: ప్రభుత్వాన్ని పడగొట్టేoదుకు మోదీ, కెసిఆర్ కుట్రలు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్‌ను ఓడించాలని మోదీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యా రు

వారిద్దరూ కలిసి విషం కక్కుతు న్నారు
అదిలాబాద్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, అదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ(modi), కేసీఆర్(kcr) విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్‌ను ఓడించాలని మోదీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యా రు. ఆ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్‌లో ఒక దొంగను ఓడగొట్టా మని, మే 14న మ‌రో దొంగ‌ను ఓడిస్తామ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన సీసీఐ పరిశ్రమను మోదీ, కేడీ కలిసి మూయించార‌ని రేవంత్ ఆరోపించారు. త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని హామీ ఇచ్చారు.

త్వరలో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ(run mafi) చేయబోతున్నామని అన్నా రు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని అక్కడి ముం పు ప్రాంతాలపై ప్రభుత్వాన్ని ఒప్పి స్తామని హామీ ఇచ్చారు. మోదీ, కేడీ పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ‌కు ఏమీ చేయలేదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. అధికారంలోకి వస్తే ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రధాని మోదీ చెప్పార న్నారు.

జన్ ధన్ ఖాతాలో డబ్బు లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇప్ప‌టికే ఐదు గ్యారెంటీలను(five guarantee scheme ) అమ లు చేశామని మిగతా హామీని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో యూని వర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తు న్నామ‌న్నారు. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామ న్నారు.

పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం(congress govt) వెలుగులు నింపుతోందని ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలం గాణలో ప్రజాపాలన ప్రారంభమైంద ని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. పేదలకు అండగా నిలబడిన వారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని పేర్కొన్నా రు. ఇక్కడి నాగోబా జాతరకు రూ.6 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబా ద్‌ను సస్యశ్యామలం చేస్తామన్నా రు.

Modi and KCR conspiracy on Revanth govt