Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth reddy: మోదీకి ఓటమి మనాధితో మతాల మధ్య మంటలు

దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పవనా లు వీస్తున్నాయని, దాంతో ప్రధాని మోదీకి ఓటమి మనాధి, భయం పట్టుకున్నాయని అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రజ ల మధ్య విద్వేషాలను రెచ్చగొడు తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరో పించారు.

మోదీ ఏం చేసినా కేంద్రంలో ఇండియా కూటమిదే పైచేయి
డిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలే
పదేళ్ల పాలన వారికిచ్చారు ఇక ఇప్పుదు కాంగ్రెస్ కు ఇవ్వండి
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌లో కాంగ్రెస్‌ సభల్లో సీఎం రేవంత్‌

ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పవనా లు వీస్తున్నాయని, దాంతో ప్రధాని మోదీకి ఓటమి మనాధి, భయం పట్టుకున్నాయని అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రజ ల మధ్య విద్వేషాలను రెచ్చగొడు తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఆరో పించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల(hinduvu) ఆస్తులను గుంజుకొని ముస్లింలకు పంచుతారన్న మోదీ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇది సాధ్య మేనా రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆస్తులను ఎవరూ తీసుకునే హక్కు లేదని, దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ లబ్ధి పొందాల ని మోదీ చూస్తున్నారని పేర్కొన్నా రు.

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రాలతో పాటు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అంతాయ పల్లిలో సోమవారం నిర్వహించిన జనజాతర వేర్వేరు సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మతాల ఆధారంగాఎవరి నమ్మకాలు వారికి ఉంటాయని, దేవుడు గుడిలో ఉం డాలని, భక్తి గుండెల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. రాముడు బీజే పీ వాళ్లకే కాదు, తమకూ దేవుడేన ని, ఇతర దేవుళ్లను కూడా తాము ఆరాధిస్తామని తెలిపారు. నేను హిందువునైనందుకు గర్విస్తానని, అదే సమయంలో ఇతర మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మత సామరస్యాన్ని కాపాడే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో మోదీ, గల్లీలో కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు.

సీఎంగా కేసీఆర్‌, పీఎంగా మోదీ పదేళ్ల పాటు ఉండి ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని, వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను(Welfare schemes) అమలు చేసిన మా ప్రభుత్వాన్ని మాత్రం పడగొట్టాలంటున్నారు, మ రి పదేళ్లు అధికారంలో ఉన్నోళ్ల ను నడి బజార్‌లో ఉరి తీయాలా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలా మీ రే నిర్ణయించాలని, అయినా, మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టా లని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకా లేక రాజీవ్‌ ఆరోగ్య శ్రీ(Rajiv arogya sree) పరిమితిని రూ. 10లక్షలకు పెంచినందుకా, 40లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండ్‌ ఇస్తున్నందుకా, ప్రతి పేదవా డికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నందుకా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తమ పథకాలను చూసి మోదీ, కేసీఆర్‌(CM KCR) కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. వంద రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన తమ సర్కారును పడగొడితే నిరుద్యోగు లు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాపా లన మొదలైందని, ఆరు గ్యారెం టీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేశామని గుర్తు చేశారు. బాసర సరస్వతీ దేవి సాక్షిగా వచ్చే పంద్రా గస్టులోగా 2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తనదని అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని, క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని భరోసా ఇచ్చా మని, వారు కోరుకుంటున్నట్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడగొడితే పథకాలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

Modi and KCR thief