పోలీసుల నటుడు మంచు మనోజ్ పోలీసులు
ఘాట్ రోడ్డులో ఉన్న రిసార్ట్ లో బస చేయడమే కారణం
ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని ఎస్ఐతో వాగ్వాదం
Actor Manchu Manoj : ప్రజాదీవెన, తిరుపతి: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌ను సోమవారం రాత్రి తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలే ఫ్యామిలీ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి, మరోవైపు ఒకరిపై ఒకరు మంచు మోహన్ బాబు, మంచు మనోజు ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో మంచు మనోజ్‌ను బాకారావు పేట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
బాకారావు పేట్ ఘాట్ రోడ్డులో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్స్‌లో మంచు మనోజ్ సోమవారం రాత్రి బస చేశారు. ఎస్ఐ రాఘవేంద్ర రాత్రి 11గంటల సమయంలో గస్తీ నిర్వహణలో భాగంగా రిసార్ట్ వద్దకు వెళ్లి ఎవరెవరున్నారని విచారించారు. మనోజ్ ఉన్నాడని సిబ్బంది చెప్పారు. అదే సమయంలో ఎస్ఐ వద్దకు వచ్చిన మనోజ్ ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని అడిగారు. సెలబ్రిటీ అయిన మీరు దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదని, ఈ ప్రాంతంలో బస చేస్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మనోజ్‌కు ఎస్ఐ చెప్పారు.
ఎస్ఐని ప్రశ్నించిన మంచు మనోజ్
తాను రిసార్టులో ఉంటే సైరన్ ఎందుకు వేస్తారని, తన ప్రైవసీని ఎందుకు డిస్టబ్ చేస్తారని ఎస్ఐని నటుడు మంచు మనోజ్ ప్రశ్నించారు. అనంతరం రిసార్ట్స్ నుంచి మనోజ్‌ను బాకారావు పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్‌కు చేరుకున్న తరువాత ఆయన సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో వాదనకు దిగారు. సీఎం పేరుతో తనతో పాటు తన అనుచరులను బెదిరిస్తున్నారని ఇది సరికాదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుం టారని సీఐని మంచు మనోజ్ ప్రశ్నించారు. మోహన్ బాబు విశ్వవిద్యా లయం వద్ద ఉన్న షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిం చారు. అర్ధరాత్రి తర్వాత కూడా పోలీస్ స్టేషన్లోనే బైఠాయించిన మనోజ్ తనను ఎందుకు వెంబడిస్తు న్నారో పోలీసులు చెప్పాలని డిమాండు చేశారు. మరోవైపు మంచు మనోజ్ లాయర్ బాకారావు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ, ఎస్ఐతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తన ప్రైవసీకి భంగం కల్గించమని హామీ ఇస్తేనే వెళతానని మనోజ్ చెప్పారు. చివరకు అర్ధరాత్రి 12.50గంటలకు బాకారావు పోలీస్ స్టేషన్ నుంచి మనోజ్ వెళ్లి పోయారు. పీఎస్ నుంచి మంచు మనోజ్ రిసార్టుకు తిరిగి వెళ్లిపోయారని తెలియగానే సస్పెన్స్ వీడింది. మనోజ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నన్ను తొక్కేయాలని చూస్తున్నారు!
నన్ను తొక్కాలని చూసినా, నాలుగు గొడల మధ్య ఉండేలా కొందరు చేస్తున్నారని మంచు మనోజ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఏం చేసినా సరే, జనం గుండెల్లో నుంచి తీయలేరని.. నాకు అంతా అభిమానులే అన్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి పేరు, చెట్టు పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి కాయనో లేదా పండునో కాదన్నారు. తనను ఏం చేయాలన్నా అది అభిమానులకే సాధ్యమని, మిగతావారు తనను ఏం చేయలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.