Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:29 am Posted by : prajadeveena.com

Amaravati Capital Development: అమరావతిపై జగన్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరం: మంత్రి నారాయణ

Amaravati Capital Development: అమరావతి రాజ ధాని అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys jagan) చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తవుతున్న సమయంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

అమరావతి (Amaravati) లో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ (minister narayana), కొందరు కావాలనే రైతులను రెచ్చగొట్టి ప్రాంతం లో అనవసర ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నార ని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో విభేదాలు పెంచి అభివృద్ధి కార్యక్రమాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ క్షేత్రస్థాయిలో జరుగుతు న్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి మాట్లాడాలని నారా యణ సూచించారు. ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్‌లైన్‌ల నిర్మాణం వంటి కీలక మౌలిక సదుపాయాల ప నులు జరుగుతున్న నేపథ్యంలో భూములను తిరిగి ఇవ్వా లనే ప్రతిపాదన ఎంతవరకు సాధ్యమో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు.

Also Read:karnataka cm dk shivakumar : బాధ్యతలు చేపట్టగానే వరుస హామీలు ప్రకటించిన డీకే శివకుమార్

ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి (Minister narayana) పరిశీ లించారు. కొండవీటి వాగుపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనల పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే మట్టిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన ప్రాంతాల్లో కొండవీటి వాగును మరింత విస్త రించే చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి, నీరుకొండ వద్ద నిర్మాణంలో ఉన్న జలాశయ పనులను కూడా పరిశీ లించారు. భారీ వర్షాలు (heavy rains)వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రాజధాని పనులను నిర్దే శిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.