–యువతకు అవకాశాలు కల్పిస్తాం అందిపుచ్చుకోండి
–ఉద్యోగంతోనే సంతృప్తి చెందొద్దు, సంస్థలను స్థాపించే స్థాయికి ఎద గండి
— మే 2న ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం
–ఇక అమరావతి అన్‌స్టాపబుల్ గా ముందుకు
— ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
AP CM Nara Chandrababu Naidu :
ప్రజా దీవెన, అమరావతి: దేశ భ విష్యత్ యువత చేతిలోనే ఉంద ని, ప్రభుత్వం కల్పించే అవకాశాల ను వారు అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉద్యోగంతోనే సంతృప్తి చెందకుండా, సంస్థలను స్థాపించే స్థాయికి యువత ఎదగా లని అన్నారు. మే 2వ తేదీన ప్రధా ని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతు న్నామని, క్వాంటమ్ వ్యాలీకి అమ రావతి కేరాఫ్ అడ్రస్ కానుందని అ న్నారు. విట్ వర్సిటీలో ‘వి లాంచ్ పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్ పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. క్యాంపస్‌లో మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ ముఖ్ బ్లాక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉ ద్ధేశించి సీఎం చంద్రబాబు మాట్లా డారు. ఆయన ప్రసంగం వారిమా టల్లోనే…విట్ అధినేత విశ్వనాథన్ సాధార ణమైన వ్యక్తిగా తన జీవి తం ప్రారంభించి అసాధారణమైన వ్యక్తిగా ఎదిగిన తీరు అభినందనీ యం. 20 ఏళ్లు రాజకీయాల్లో ఉ న్నారు. ఆ రోజుల్లో పార్లమెంటులో అన్నాదురైతో తర్వాత కరుణాని ధి, ఎంజీఆర్, జయలలితతో పని చేశారు. విశ్వనాథన్ 2014లో ఎ న్నికల ఫలితాలు రాకముందే న న్ను కలిశారు. గెలిచిన వెంటనే అ మరావతిలో విట్ ఏర్పాటుకు అ నుమతి కోరారు. ఆ రోజు విట్ కో సం విశ్వనాథన్ 200 ఎకరాలు అ డిగారు. నేను 100 ఎకరాలు ఇ చ్చాను. వారికి కావాల్సిన మరింత భూమి ఇచ్చే బాధ్యత నాది. అయి తే రాబోయే ఏడేళ్లలో 50 వేల మం ది స్టూడెంట్స్ విట్‌లో చదివేలా అ భివృద్ధి చెందాలి. విట్ అమరావతి లో 95 శాతం ప్లేస్‌మెంట్స్ జరుగు తుండటం అభినందనీయం. ప్రపం చంలోని టాప్ 100 యూనివర్సిటీ లో విట్ ఉండటం మనకు గర్వకార ణం. విట్ విద్యాసంస్థల్లో మన అ మరావతి విట్ నెంబర్‌వన్‌గా ఉం డాలని నేను కోరుకుంటున్నాను.
అమరావతికి తిరుగులేదు…
ప్రధాని మోదీ చేతుల మీదుగా రా జధాని పనులు పున: ప్రారంభమ వుతాయి. నేను అందరిలా మాట లు చెప్పను. ప్రజలకు మంచి చేసి చూపిస్తాను. నాపై నమ్మకం పెట్టు కుని 29 వేల మంది రైతులు, 34 వేల ఎకరాల భూమి రాజధానికి ఇచ్చారు. అభివృద్ధిలో భాగస్వా మ్యం అవుతామని రైతులు ముం దుకురావడం అభినందనీయం. 19 91లో ఆర్థిక సంస్కరణలకు మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు శ్రీకారం చుట్టారు. వాటిని నేను అం దిపుచ్చుకున్నాను. భవిష్యత్ ఐ టీదే అని గ్రహించి దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాను.14 నెలల్లో హైటెక్ సిటీ నిర్మించాం. ఇప్పుడు రాజధాని అమరావతిపై దృష్టి కేంద్రీ కరించాం. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏ ర్పాటు చేయబోతున్నాం. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వే స్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ మా ట్లాడితే కొందరికి అర్ధం కాలేదు. ఇ ప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ గు రించి మాట్లాడితే అది ఏం చేస్తుం దంటున్నారు. ప్రతి ఇంట్లో ఎంట్రప్రె న్యూర్ తయారుకావాలి. అమరావ తిలో విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి వి ద్యాసంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నా యి. భవిష్యత్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలు అమరా వతికి రాబోతున్నాయి. 29 వేల మంది రైతులు, రైతు కూలీలు అ మరావతికి సహకరించారు. వారం దరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. వారిలో కొం దరిని దత్తత తీసుకోమని విట్ చా న్సలర్ జి. విశ్వనాథన్‌ను నేను కో రాను.
నాసా నుంచి వాల్ స్ట్రీట్ వర కూ మనోళ్లే.. విద్యార్థులకు చదు వు ముఖ్యం. చదువుతోనే విజ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని ఆచరణలో పె ట్టాలంటే వినూత్నంగా ఆలోచన చే యాలి. నాలెడ్జ్ ఎకానమీలో ప్రపం చవ్యాప్తంగా భారతీయులు ముం దుంటే, అందులో తెలుగువారు ట్రెండ్‌సెట్టర్లుగా ఉన్నారు. మన తెలుగువారి జనాభా 5 శాతమే అయినప్పటికీ ఐఐటీల్లో 20 శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు అన్ని చోట్ల మన తెలుగువా రే సత్తా చాటుతున్నారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రానూ యీ, అజయ్ బంగా, శాంతను నా రాయణ్ వంటి వారు గ్లోబల్ సంస్థ ల్ని బలోపేతం చేస్తుండటం మనకు గర్వకారణం.
సమాజమే దేవాలయం ప్రజలే దే వుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ స్పూర్తితో పీ4కు శ్రీకారం చుట్టాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న 10 శాతం మంది ఆర్థిక ఇ బ్బందులతో, పేదరికంలో అట్టడు గున ఉన్న 20 శాతం కుటుంబా ల ను పైకి తీసుకురావాలి. 2029 నా టికి రాష్ట్రంలో పేదరికం అనే మాట వినపడకూడదు. పౌరుల ఇంటి వ ద్దకే ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీ కారం చుట్టాం. ఒకప్పుడు చిన్న పనికి కూడా ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చేది. గంటల తరబడి కార్యాలయాల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేది. వాట్సాప్ గవర్నె న్స్ ద్వారా 1,000 సేవలను పెం చుతాం. ఏటా 15 శాతం వృద్ధి రేటుతో స్వర్ణాంధ్ర 2047 సాధించా లని నిర్ణయించాం. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.55 లక్షలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకు న్నాం. ప్రధాని మోదీ వికసిత్ భార త్ 2047 ప్రణాళిక తయారు చేశా రు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. టెర్రరిస్టుల కుట్రలు, కుయుక్తులు మనల్ని ఏం చేయలేవు. మన ఐ
క్యతను దెబ్బతీయలేవు. రాష్ట్ర స్థా యిలో ప్రతి ఇంటిని జియో ట్యాగిం గ్ చేస్తున్నాం. దీనివల్ల భవిష్యత్‌లో ఏదైనా విపత్తు వస్తే మందులు, ఆ హారం డ్రోన్ల ద్వారా పంపవచ్చు.
విశాఖకు త్వరలో మెట్రో రైల్
అన్ని ప్రాంతాలను సమానంగా అ భివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆ ధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. విశాఖకు కొత్త ఎయిర్ పోర్టు, మెట్రో తో పాటు త్వరలో గూగుల్ రాబో తున్నది. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. అనకాపల్లిలో ఆర్సె ల్లార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీ రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతోంది. రాయలసీమలోనూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతాం. అనంతపురంలో లేపాక్షి మొదలు ఓర్వకల్లు వరకూ నాలెడ్జ్ హబ్‌గా తయారుచేస్తాం. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొ బైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చే స్తాం. భవిష్యత్ డ్రోన్లదే. ఓర్వకల్లు లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తాం. మో దీ నాయకత్వంలో మేకిన్ ఇండి యా కార్యక్రమం కింద 130 బిలి యన్ యుఎస్ డాలర్లతో హార్డ్‌వేర్ రంగం అభివృద్ధి చెందుతోంది. భవి ష్యత్‌లో 500 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఉత్పత్తులు త యారుచేసే స్థాయికి మన దేశం చేరుతుంది.
విట్ విద్యార్థుల ప్రశ్నలు- సీఎం సమాధానాలు అమరావతిలో అభివృద్ధి పనులు, రాష్ట్రంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ఐటీ, ఏఐ వినియోగంపై విట్ విద్యార్థులు పలు ప్రశ్నలు అడగ్గా ముఖ్యమంత్రి వాటికి సమాధానం చెప్పారు. రా ష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పేదరికం రూ పుమాపడం, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పె ట్టామని సీఎం చెప్పారు. ఎన్టీఆర్, అంబేద్కర్, కలామ్ వంటి వారంతా సాధారణ స్థాయి నుంచి వచ్చినవా రేనని మహనీయుల స్పూర్తితో యువత తాము ఎంచుకున్న మా ర్గంలో రాణించాలని అన్నారు. రాజ కీయాలను తాను సేవా మా ర్గంలోనే చూశానని అన్నారు. రాత్రి కి రాత్రే జాక్ పాట్ కొట్టేయాలనుకో వడం అత్యాశే అవుతుంది. జీవి తంలో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వారికి తిరుగుండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు