AP Schools Open June: జూన్ 12నే ఏపీ స్కూళ్ల ప్రారంభం
AP Schools Open June: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై కొనసాగుతున్న సందిగ్ధతకు విద్యాశాఖ తెరదించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల(Summer Holidays)ను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశముందంటూ సామాజిక మాధ్యమాల్లో(social media) జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని విద్యాశాఖ (Education Department)స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు వదంతులను నమ్మవద్దని సూచించింది. విద్యా క్యాలెండర్(Education Calendar)లో పేర్కొన్న విధంగానే...