Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister Chandrababu Naidu: మేథోమధనంతో మరింత మెరుగైన సేవలు

–పౌరసేవల్లో సంతృప్తి స్థాయే ము ఖ్యం

–ప్రభుత్వ శాఖల పనితీరుపై నెల వారీ ఆడిట్ జరగాలి

–వాట్సప్ గవర్నెన్స్ వినియోగం మ రింత పెరగాలి

–ఆర్టీజీఎస్, పౌర సేవలపై సమీ క్ష లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

Chief Minister Chandrababu Naidu : ప్రజా దీవెన, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగు పరిచేందు కు అధికారులు మేధోమధనం జర పాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశించారు. పౌ ర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్ర భుత్వానికి ముఖ్యమని సీఎం చం ద్రబాబు స్పష్టం చేశారు.సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ క మాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆర్టీజీ ఎ స్, పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వ హించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, సీఎస్ కే.విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు హాజర య్యారు.

వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభు త్వం అందిస్తున్న పౌర సేవల్లో ప్రజ ల సంతృప్త స్థాయి పెంచడంపై ము ఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఐవీ ఆర్ఎస్‌తో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది, అసంతృప్తి ఎక్కడెక్కడ ఉందన్న స మాచారాన్ని క్రోడీకరించాలని సూ చించారు. తద్వారా సమస్య మూ లాలను కనుగొని వాటిని వేగంగా పరిష్కరించటం ద్వారా ప్రజల్లో సం తృప్తి స్థాయిని మరింత మెరుగుప రుచుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ డేటా లేక్‌లో అపారమైన సమాచారం నిక్షిప్తమై ఉందని త ద్వారా డేటా ఆధారిత నిర్ణయాల ను వేగంగా తీసుకునేందుకు ఆస్కా రం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రం యూనిట్‌గా ప్రభుత్వం 19 విభాగాల ద్వారా అందిస్తున్న సేవ లపై ప్రతీ రోజూ దృష్టి సారించాలని అలాగే ప్రతీ 15 రోజులకూ ఒకసారి సమాచార సేకరణ చేయాలని సూ చించారు. వీటిపై ప్రతీ నెలా ఆడిట్ నిర్వహించి ప్రతీ మూడు నెలలకూ ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచిం చారు. దీనికోసం రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గం స్థా యిలో సమాచారం తీసుకుని విశ్లే షించాలని పేర్కొన్నారు. 15 నెల లుగా ప్రజల్లో సంతృప్తి స్థాయి క్ర మంగా మెరుగు పడుతోందని, మ రింత పెరగాలని అన్నారు. ప్రభు త్వం అందిస్తున్న అన్ని సేవల్లో ప్ర జ లు ఎలా స్పందిస్తున్నారన్నదే ప్రధా న అంశమని ముఖ్యమంత్రి పేర్కొ న్నారు. గత పాలకుల నిర్వాకం కా రణంగా రెవెన్యూ రికార్డులు తారు మారై వివాదాలు పెరిగాయని, వా టిని సరిచేస్తున్నట్టు సీఎం తెలిపా రు.

*ప్రధాని మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీ శంకుస్థాపన*

ప్రజలకు అందిస్తున్న సేవల ప్రమా ణాలను మెరుగుపరుచుకుని సం తృప్త స్థాయిని పెంచుకోవాలని సీ ఎం సూచించారు. ప్రభుత్వ శాఖ లు, అధికారులు, ఉద్యోగుల పనితీ రు విషయంలో ఎలాంటి రాజీ లేద ని స్పష్టం చేశారు. ప్రభుత్వ యం త్రాంగంలో నైపుణ్యాలు పెంచేందు కు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రభుత్వం అ మలు చేస్తున్న వివిధ సంక్షేమ పథ కాల్లో కొందరు సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందడం లేదని, అ లాంటివారి అర్హతలు పరిశీలించి వా రు కూడా ప్రభుత్వ పథకాల ఫలా లు పొందేలా చూడాలని అధికారు లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

వాట్సప్ గవర్నెన్సు ద్వారా అం ది స్తున్న 730 సేవల వినియోగం మ రింతగా పెంచేందుకు చర్యలు చేప ట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవలు వాట్సప్ గవర్నెన్సు ద్వారా సులభంగా అందుతాయనే భావన ప్రజల్లో విస్తృతమైతే ఎక్కు వగా వినియోగించే ఆస్కారం ఉం టుందన్నారు. దీనికి తగినట్టుగా ప్రజల్లో అవగాహన మరింత పెంచా లని సూచించారు. డ్రోన్ల వినియోగా నికి సంబంధించి ప్రభుత్వ విభాగా లతో పాటు ప్రైవేటు వినియోగం కూ మీడా పెరిగేందుకు ఉన్న అవకా శాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమం త్రి పేర్కొన్నారు.

వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం మ రింతగా పెరగాల్సిన అవసరం ఉం దన్నారు. డ్రోన్ వినియోగాన్ని మ రింతగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. డిసెంబరులో డ్రోన్ షో ని ర్వహించాలని ముఖ్యమంత్రి ఈ స మావేశంలో నిర్ణయించారు. ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం ప ర్యటనకు వస్తున్న దృష్ట్యా డ్రోన్ సి టీకి శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా జరిగేలా ఏర్పాట్లు చేయా లని సీఎం ఆదేశించారు. సీసీ కెమె రాలను ట్రాఫిక్ సహా నేర నియంత్ర ణ, శాంతిభద్రతల పరిరక్షణకు స మర్ధవంతంగా వినియోగించుకోవా లన్నారు.