–శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే వీఐపీ వసతి గదులు
–వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానo అమలు
Big Breaking : ప్రజా దీవెన తిరుమల:తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధివిధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చు ట్టింది. దర్శన టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే వసతి గదులు కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తం గా 7,500 గదులు ఉండగా సీఆ ర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కా ర్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అరైవల్ కింద మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీలకు జారీచేస్తోంది. వీటిని శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది.
ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్టును తప్పనిసరి చేసింది. గతంలో వీఐపీ గదులను ఆధార్‌తో దళారులు పెద్దఎత్తున తీ సుకుని వారి ఆధీనంలో ఉంచుకు. నేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్ద రు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పిస్తుండటంతో దర్శనా నంతరం ఖాళీచేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరు లకు కేటాయించే అవకాశం లభి స్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగుతుండడం గమనార్హం.