Forest Martyr Naik :ప్రజా దీవెన, సత్యసాయి జిల్లా:ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతి కకాయానికి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ని వాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కళ్లితండా లోని శ్రీ మురళీ నాయక్ నివా సా నికి వెళ్లి మంత్రుల నారా లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, శ్రీ అనగాని సత్య ప్రసాద్, పలువురు శాసన సభ్యులతో కలసి అశ్రునయనాలతో నివాళులు అ ర్పించారు. మురళీ నాయక్ తల్లి దండ్రులు జ్యోతి బాయ్, శ్రీరాం నా యక్ నీ పరామర్శించారు. పుత్ర శో కంలో ఉన్న ఇరువురినీ ఓదార్చి ధై ర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం, ఐదు ఎకరాల పొలం, 3 00 గజాల స్థలంతో పాటు కుటుం బ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగతంగా మురళీనాయక్ కు టుంబానికి మరో రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలి పారు.ఇలాంటి పరిస్థితులు ఏ కు టుంబానికి రాకూడదని వ్యాఖ్యా నించారు.