Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, జగన్ కోటలో టీడీపీ పాగా, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ గల్లంతు 

Big Breaking :  ప్రజా దీవెన, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎ స్ జగన్‌ మోహన్ రెడ్డి కంచుకోట లో టీడీపీ పాగా వేసింది. దీంతో ప్ర తిష్టాత్మ కమైన పులివెందుల ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయా ల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎ న్నికలో తెలుగుదేశం పార్టీ విజయ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓ ట్లతో విజయదుందుభి మోగించిం ది. 6,050 ఓట్ల మెజారిటీతో లతా రెడ్డి గెలవగా లతారెడ్డి వైసీపీ అభ్య ర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోవ డం గమనార్హం.

 

వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించారు. లతారెడ్డి గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.

 

ప్రజలు వీధుల్లోకి వచ్చి లతారెడ్డిని ఆశీర్వదిస్తూ పులివెందులలో ప్రజా స్వామ్యం గెలిచిందని ప్రజలు అభి ప్రాయం వ్యక్తం చేస్తుoడడం విశే షం.

 

మరోవైపుఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి ఆధి క్యంలో ఉన్నారు. కడప పాలిటెక్నిక్ కాలేజ్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీ సీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు బరి లో నిలించారు. టీడీపీ, వైసీపీ అ భ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెల కొంది. పులివెందులలో 74శాతం, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది.కడప పాలిటెక్నిక్ కళా శాలలో పులి వెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది.

 

ఒకే రౌండ్‌లో పులివెందుల జెడ్పీ టీసీ కౌంటింగ్ పూర్తి అయింది. పులి వెందుల జెడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్‌కు ప ది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌం టింగ్ పూర్తికానుంది. ఒక్కో టేబు ల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పా ట్లు చేశారు. మధ్యాహ్నానికి ఒంటి మిట్ట జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రి య పూర్తి కానుంది. అయితే, ఎన్ని కలు ఏకపక్షంగా జరిగాయని ఆరో పిస్తూ కౌంటింగ్‌‌ను వైసీపీ నేతలు బ హిష్కరించిన విషయం విధితమే.