Deputy CM Pavan Kalyan: ప్రజా దీవెన, వెలగపూడి: ఆంధ్రప్ర దేశ్ అసెంబ్లీలో వైసిపి కి విపక్ష హో దా ఇవ్వాలని కోరుతున్న ఆ పార్టీ అధినేత జగన్ కు జన సేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ పలు కీలక వ్యాఖ్య లు చేశారు. అసెంబ్లీ మీడియా పా యింట్ లో ఆయన సోమవారం మీ డియాతో మాట్లాడుతూ 11 సీట్లు ఉన్న వైసిపి కి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని నిలదీశారు. అసలు వైసీపీ పార్టీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. వైసీపీకి 11 సీట్లే వచ్చినా స్పీకర్ ఇన్ని రోజులు వాళ్ల కు సరైన గౌరవం ఇచ్చారని చుర కలు అంటించారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెం బ్లీకి రండి అంటూ ఆహ్వానించారు.
అసెంబ్లీలో వైసిపి కంటే తమదే పెద్ద పార్టీ అని పేర్కొన్నారు. విపక్ష హో దా అ నేది ఒకరిచ్చేది కాదని, అది ప్రజలే ఇవ్వాలని జగన్ కు హితవు పలికా రు.వైసీపీ నాయకులు సభ లో హుందాగా వ్యవహరించాల్సిన కనీస బాధ్యత ఉందని సూచిం చా రు. తొలి రోజునే గవర్నర్ ప్ర సంగం ఎలా అడ్డుకుంటారని ప్ర శించారు. తొలుత ప్రజల తీర్పు గౌరవించాల ని హితవు పలికారు. వైసిపి స్థా యికి తగ్గట్టు అసెంబ్లీ లో అవకాశా లు ఉంటాయని తెలిపారు. స్పీకర్ కూడా చాలా గౌరవం గా సమయం ఇచ్చారని వైసిపిని ఎట్టి పరిస్థితి లో ఇబ్బంది పెట్టలేదని వివరించారు. వైసిపి హుందాగా ఉండాలని సూ చించారు.