Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Pawan Kalyan : పవన్ పవర్ పంచ్, దేశం చూపు ఏపీ వైపు

Deputy CM Pawan Kalyan : ప్రజా దీవెన, కర్నూలు: దేశం మొ త్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంద ని డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కష్ట సమయంలో కూట మిని గెలిపించారని 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చార న్నారు. ఎన్డీయే కూటమిని 21 ఎం పీ స్థానాల్లో గెలిపించారని తెలిపా రు. ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభ వజ్ఞుడైన చంద్రబాబే కారణమన్నా రు. రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటారని ము ఖ్యమంత్రి స్ఫూర్తితోనే తాను పనిచే స్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయ కత్వంలో కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థల ను పటిష్ఠం చేస్తున్నామని డిప్యూ టీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన నాయకత్వానికి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. గెలుపులోనే మనుషులను లెక్కిం చం కష్ట సమయంలోనూ ఎలా ఉన్నారనే చూస్తాం. కష్ట సమ యంలో బలంగా నిలబడినందునే విజయం సాధించాం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, యువత, మహిళ లకు దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్‌ నిర్మాణంలో భాగంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫాంపాండ్‌ నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భూమి పూజ చేశారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హావిూ పథకానికి ప్రధానంగా కావాల్సింది కష్టపడి పనిచేయడమే అని తెలిపారు. రాయలసీమలో నీటి కష్టాలు అధికంగా ఉండేదన్నారు.

 

 

భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమ లో లేదన్నారు. మే నెలలోపూ లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వర్షాల సమయంలో లక్షా 55 వేల నీటి కుంటలు నిండితే ఒక టీఎంసీ నీల్లు వస్తాయన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లు- రాయలసీమ రతనాల సీమ అవ్వాలన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాదని.. అందరికీ కావాలన్నారు. ఒకే రోజు 13326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. పని చేసే సత్తా ఉందని.. పని కోసం దిశానిర్దేశర చేసే ఏ స్వార్ధం లేని వ్యక్తులు కావాలన్నారు. రాష్ట్రం బాగుండాలని సీఎం కోరుకున్న విధంగా.. ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు ఇచ్చిన శాఖలను బలంగా చేయాలని ఒకే రోజు 13326 గ్రామసభలు నిర్వహించి.. అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామన్నారు. పంచాయతీరాజ్‌ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు మంత్రివర్గం పరిపాలనా సంస్కరణలను ఆమోదించిందన్నారు. గ్రావిూణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ ఉపాధి హావిూ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మందికి ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లో ఉపాధి కల్పించామన్నారు. ఈ పథకం కింద రూ.9.5 కోట్లు- ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఉపాధి ఆర్థికత స్థిరత్వం కల్పించేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 4వేల పైచిలుకు రోడ్లు మాత్రమే నిర్మించారని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4వేల కిలోవిూటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. రూ.1600 కోట్ల వ్యయంతో రోడ్లను నిర్మించినట్లు- చెప్పారు. 100 మందికిపైగా ఉన్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్‌, తాగునీరుతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు- తెలిపారు. లక్షా 55 వేల పంట కుంటలు నిండితే మనకు ఇబ్బంది ఉండదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. రాయలసీమ రతనాల సీమ కావాలి.. అభివృద్ధి కొందరికే కాకుండా అందరికి కావాలని తెలిపారు.

 

 

అభివృద్ధిలో చంద్రబాబు నాయకత్వంలో ముందడుగు వేస్తున్నాం.. 16 వేల కోట్లతో 4 వేల కిలోవిూటర్లు రోడ్లు నిర్మించాం.. ఇజ్రాయెల్‌ ప్రపంచానికే డ్రిప్‌ ఇరిగేషన్‌ టెక్నాలజీ ఇచ్చింది.. నీటి కుంటలు సద్వినియోగం చేసుకుంటే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు వినియోగించుకోవాలి.. నా ఫారంలో నీటికుంటలు తవ్వుకున్నాను.. పాలేకర్‌ వ్యవసాయ విధానం అనుసరించాలి.. సగటు రైతులా మాట్లాడుతున్నాను.. ఉపాధి దొరక్కపోతే, సినిమాల్లో ఛాన్స్‌ ఇవ్వకుంటే నేను నర్సరీలో పని చేయాలనుకున్నానని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. ఇక, రైతు కష్టపడతాడు, సరైన వనరులు ఉపయోగించుకోకుంటే కష్టం వృథా అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ అన్నారు. నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడేలా మాట్లాడను.. అసమానతలను వెతుక్కోను, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటా.. సనాతన ధర్మాన్ని పాటిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తా అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కర్నూలు ఎయిర్‌ పోర్ట్‌ కి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు పెడతామన్నారు. ఇక, బుడగ జంగాలకు కుల సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు.. అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను.. త్వరలోనే వారికి న్యాయం చేస్తాను అని వెల్లడిరచారు. నందికొట్కూరు నియోజకవర్గం కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో చెప్పాను.. నా ట్రస్ట్‌ ద్వారా రూ.50 లక్షలు ఇస్తా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కొణిదెల గ్రామంలో అమలు చేస్తా.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా.. టెంట్‌ వేసి అక్కడే రెండు మూడు రోజులు ఉంటాను అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోవిూటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. జాతీయ ఉపాధిహావిూ పథకంలో భాగంగా 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయింది.
నీటిని నిల్వ చేసుకోగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తాం. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హావిూ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించాం. ఉపాధిహావిూ కింద ఇప్పటి వరకు రూ.9,597 కోట్లు- ఖర్చు చేశాం. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్‌యం. వంద మందికిపైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించాం. విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించాం అని పవన్‌ అన్నారు.