Sri Rama Pattabhishekam Bhadrachalam : ప్రజా దీవెన, భద్రాచలం: దక్షిణ అ యోధ్య జనసంద్రమైంది. మిథిలా స్టేడియం జయజయధ్వానాలతో మారుమోగింది. లోకకళ్యాణం కో సం జరిగిన సీతారాముల వివా హం ఒక ఎత్తైతే, ధర్మ సంస్థాపన కో సం రామయ్య పట్టాభిషిక్తుడైన ఘ ట్టం భక్తులను పరవశంలో ముంచె త్తింది. శనివారం ఉత్సవమూ ర్తు లను ఊరేగింపుగా వేదికపైకి తీ సుకురావడంతో వేడుక ప్రారంభ మైంది. విశ్వక్సేన పూజ, పుణ్యా హవాచనం అనంతరం ఎనిమిది మంది వేద పండితుల మంత్రో చ్చా రణల మధ్య పట్టాభిషేక క్రతువు శాస్త్రోక్తంగా సాగింది. ఈ మహో త్స వంలో రామయ్యకు సమర్పించిన ఒక్కో ఆభరణం వెనుక ఒక విశిష్ట త, భక్త రామదాసు అపారభక్తి కని పిoచాయి.
సార్వభౌమాధికారానికి చిహ్నంగా రాజదండాన్ని, ధర్మ రక్షణకు గు ర్తుగా బంగారు పాదుకలను స్వా మివారికి సమర్పించారు. భక్త రా మదాసు చేయించిన జగత్ ప్రసిద్ధ ‘పచ్చల పతకం’ రామయ్య హృద యాన్ని అలంకరించగా, సీతమ్మకు ‘చింతాకు పతకం’, లక్ష్మణుడికి ‘శ్రీ రామమాడ’ అలంకరించారు. వేడుకకు పరాకాష్ఠగా, భక్తుల కర తాళ ధ్వనుల మధ్య స్వామివారికి ‘స్వర్ణ మకుటాన్ని’ ధరింపజేశారు. ‘శ్రీరామ సార్వభౌమా.. జయహో!’ అన్న నినాదాలతో భద్రాద్రి గిరులు ప్రతిధ్వనించాయి. గగనం నుంచి దిగివచ్చిన ముత్యాలహారం.
దేవేంద్రుడు కానుకగా పంపినట్లుగా భావించే అత్యంత అరుదైన ము త్యాల హారాన్ని రామయ్యకు అ లంకరించారు. ఆహారం రాముడి నుండి సీతమ్మకు, అక్కడి నుంచి హనుమంతుడికి చేరిన ఘట్టం భ క్తుల కళ్ళకు కట్టింది. అనంతరం స ప్త నదులు, నాలుగు సముద్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో భక్తులందరిపై ప్రోక్షణ చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ శివ్ ప్రతాప్ శు క్లా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమ ర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

