Gang Rape : ప్రజా దీవెన గన్నవరం: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో దారుణ సంఘ టన చోటు చేసుకుంది. ఓ బాలిక ను నాలుగు రోజులపాటు బంధించి న యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘాతుకం వెలు గు చూసింది. పోలీసుల కథనం ప్రకారం ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు కు చెందిన 14 ఏళ్ల బాలిక పక్కింటి మహిళతో కలిసి ఈ నెల 9న వీరప నేనిగూడెం వచ్చింది. అయితే 13న ఓ వివాదం కారణంగా ఆ ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చే సింది.బాలిక ఒంటరిగా బయటకు రావడాన్ని గమనించిన 15 ఏళ్ల బాలుడు, రజాక్ అనే మరో యువ కుడు బాలిక వద్దకు వెళ్లి బైక్‌పై జి.కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అనిల్, జితేంద్ర అనే ఇద్దరు యువ కుల వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆపై కేసరపల్లికి చెం దిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా నాలుగు రోజులపాటు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. సోమవారం ఆమెను ఆటోలో తీసుకొచ్చి మాచవరంలో వదిలిపెట్టారు.
ఆమె పరిస్థితి చూసి అనుమానిం చిన ఓ ఆటోడ్రైవర్ వివరాలు కనుక్కొని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బాలికను అప్పగించాడు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.