Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Governor Jishnu Dev Verma : మహాద్భుతం, భద్రాద్రి రామయ్యకు మహాపట్టాభిషేకం

— ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌
–మిథిలా మండ‌పంలో మార్మోగిన రామ‌నామస్మ‌ర‌ణలు

Governor Jishnu Dev Verma :ప్రజా దీవెన, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతోన్న భద్రాచలంలో సీతారాముల కల్యా ణం వైభవోపేతంగా జరిగింది.రామనామ జపంతో భక్తులు పరవ శించిపోతుండగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాము ల కల్యాణం ఘనంగా నిర్వహించా రు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ దివారం తెల్లవారుజామున 2 గం టలకే స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరు వారాధన, ఆరగింపు, మంగళాశా సనం, అభిషేకం చేశారు. తదుపరి ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో దేవా దాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్య ర్‌, కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఉదయం 9.45 గంటలకు వేద పం డితుల మంత్రోచ్చరణ నడుమ ఊ రేగింపుగా మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అ మ్మవార్ల ఉత్సవ మూర్తులను తీ సుకొచ్చారు. స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీ నులను చేశారు. కళ్యాణం సంద ర్భంగా భక్తరామదాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు.

తొలుత రామాలయ భద్రుని మం డపంలో అర్చక స్వాములు స్వామి వారి పాదుకలకు అభిషేకం చేశా రు. రాజ లాంఛనాలతో పవిత్ర పా వన గౌతమీ నదీ తీరం నుంచి తీర్థ ములు తీసుకురాగా, భాజా భజం త్రీల సందడి, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటంతో సీతారామచంద్ర స్వామి వారికి తిరువీధి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత మిథి లా ప్రాంగణానికి తీసుకువ‌చ్చారు. శిల్పకళా శోభిత క‌ల్యాణ‌ మండ పంపై స్వామి వారిని ప్రతిష్టింప జే శారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యా హవాచనం నిర్వహించారు.

రామ‌య్య‌కు పాదుకలు, రాజదం డం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణం ధరింపజేశా రు. శ్రీరామ పట్టాభిషేక పారాయ ణం గావించారు. రుగ్వేదం, యజు ర్వేదం, సామవేదం, ఆదర్వ‌ణ‌ వే దం, విష్ణు పురాణం, భగవత్ శా స్త్రం తదితర పారాయ‌ణం చేశారు. పుష్కర నదీ జలాలతో మహాకుంభ ప్రాంతాన్ని తీర్థ సంప్రోక్షణ చేశారు. పుష్కర నదీ జలాలను తీసుకువ చ్చి పవిత్ర స్నానం ఆచరింపజేశా రు. 11శ్లోకాలను పటించి స్వామి వారికి హారతిచ్చారు.

అర్చక స్వాములు భక్తులతో పలు స్తోత్రాలను పఠింపజేశారు. శ్రీరామ నామ స్మరణలతో మిథిలా ప్రాంగ ణం ప్రతిధ్వనించింది. పట్టాభిషేకం అనంతరం భక్తులపై పుణ్య నదీ జ లాలనుజ‌ల్లారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు హా జరై స్వామివారికి పట్టు వస్త్రా ల ను సమర్పించారు. మహోత్సవాన్ని ఆధ్యాంతం తిలకించారు. తొలుత రామాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలె క్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, రా మాలయం ఈవో రమాదేవి తదిత రులు పట్టాభిషేకం వేడుకలో పాల్గొ న్నారు.

గవర్నర్ పర్యటన నేపథ్యంలో పో లీసులు భారీ బందోబస్తు ఏర్పా టుచేశారు. వేడుకలు విజయవం తంలో కలెక్టర్, ఎస్పీ, రామాలయం ఈవో కీలక భూమిక పోషించారు. వారిని మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు.