Jagan Mohan Reddy : ప్రజా దీవెన, అమరావతి: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ శాసనసభలో 2025`26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి గా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు,పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6,705 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూరాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుం దని, అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నా రు. అయినప్పటికీ సీఎం చంద్రబా బు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందిం చినట్లు చెప్పారు. 2014`19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిం దన్నారు. సవాళ్లను ఎదుర్కోవ డంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధాని ని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామ న్నారు. ప్రజల ఆకాంక్షలకు అను గుణం గా అమరావతి పనులు పెద్దఎత్తున చేపడతామని చెప్పా రు.
మహారాష్ట్రకు ముంబయి, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకూ అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబయి, హైదరాబాద్ నగరాలకు సరితూ గేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడి oచారు. తన ప్రసంగంలో మొదట గత పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్ ,ఆ తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను వెల్లడిరచారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ మేరకు నష్టపోయిందో, అభివృద్ధిలో ఎలా తిరోగమనం చెందిందో తెలిపారు. ఇదిలా ఉండగా.. తన బడ్జెట్‌ప్రసంగంలో డ్రాప్ అవుట్స్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్నారు మంత్రి. గత ప్రభుత్వంలో స్కూళ్లల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్సే కాదు.. చాలా రంగాల్లో డ్రాప్ అవుట్స్ జరిగాయన్నారు. పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయని.. రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుటయ్యాయని… పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయిందని వెల్లడిరచారు. గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో.. సభకు రాకుండా.. అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారని సెటైర్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజా జీవితం నుంచి శాశత్వంగా డ్రాప్ అవుట్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయంటూ పయ్యావుల కేశవ్ ఛలోక్తులు విసిరారు. అలాగే బడ్జెట్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లను మంత్రి ప్రస్తావించారు. ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన కామెంట్లను.. తీసుకుంటున్న చర్యలను ప్రసంగంలో తెలిపారు. చెత్త పన్నుపై అయ్యన్న కామెంట్లు గుర్తు చేయడంతో అప్పటి అయ్యన్న కామెంట్లను సభ్యులు చర్చించుకున్నారు.స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపక్షంలో ఉండగా చెత్త పన్ను వేసిన గత పాలకులపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయని మంత్రి తెలిపారు. అప్పులనే కాదు.. చెత్తను వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. చెత్త పన్ను వేయడమే కాకుండా.. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2కే కిలో బియ్యం పథకం గురించి కూడా పయ్యావుల బడ్జెట్‌లో ప్రస్తావించారు. కాలే కడుపునకు పట్టెడన్నం పెట్టేందుకు ఎన్టీఆర్ రూ. 2కే కిలో బియ్యం పథకం ప్రారంభిం చారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకమే జాతీయ స్థాయిలో చట్టంగా మారిందని… అదే ఆహర భద్రత చట్టమని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడిరచారు. ఇకపోతే బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖకు రూ.1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు,ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు,ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు,ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు,యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు, మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు,ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు, దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ.820
కోట్లు,డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు, ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపులు చేశారు.