–విశ్వవ్యాప్తంగా విస్తృతస్థాయి ప్రాచుర్యం పొందుతున్న ఆంధ్ర
king makers : ప్రజా దీవెన అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అంతకంతకు అందలమెక్కు తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విశ్వవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు విస్తృత ప్రాచుర్యం లభిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలం లో రకరకాల ఆటుపోట్లు ఎదుర్కొ న్న ఆంధ్రప్రదేశ్ ఇటీవల మళ్ళీ ప్ర త్యేక గుర్తింపును సొంతం చేసు కుంటోంది. దివంగత నేత, తెలుగు దేశం పార్టీ వ్యవస్ధాపకులు, సినీ నటులు నందమూరి తారకరామా రావు వల్ల ప్రత్యేక గుర్తింపు లభిం చింది. తెలుగు దేశం పార్టీని స్ధాపిం చి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పై దైర్యంగా విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏపీలో చిత్తు చిత్తుగా ఓడించిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అదే విధంగా కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలోనూ పెద్దన్న పాత్రను ఎన్టీ ఆర్ పోషించారు. అప్పుడు ఏపీకి రాజకీయ వర్గాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లో ప్రజల్లోనూ ప్రత్యేక గుర్తిం పు లభించింది. ఆ తరువాత మళ్లీ అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలుగుదే శం, జనసేన పార్టీల నాయకులకు హవా కేంద్రంలో చక్కర్లు కొడుతోం ది. కేంద్రంతోనూ ఎన్ డి ఏ ప్రభు త్వం ఏర్పాటుకు ఈ రెండు పార్టీలో ఎంతో దోహదం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ తరువాత కూ డా ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీ తరుఫున టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేయడం ప్రా రంభించారు. ఆ ప్రచారమే జనసే న అదినేత పవన్ కళ్యాన్, ముఖ్య మంత్రి చంద్రబాబులకు కేంద్రంలోనే కాదు. గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు లభించింది.
ఆంధ్రప్రదేశ్ లో అత్య ధిక స్థానాలు కైవసం చేసుకొని, కూ టమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి ఊపు మీద ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాబ్లు ఇతర ప్రాంతాల ఎన్నికల్లో కూడా తమ ప్రభావాన్ని చూపిస్తూ హవా కొనసాగిస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని వారిని విజయం వైపుగా నడిపించారు. దీంతో అటు సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణు గెలుపునకు మారు పేరుగా మార డంతో పాటుగా దేశ వ్యాప్త రాజ కీయాలలో తమదైన శైలిలో పాగా వేశారు. విజయ ధ్వయంగా హిస్టరీ క్రియేట్ చేశారు. సీఎం చంద్రబాబు కు దేశ రాజకీయాల్లో పవర్ సెంటర్ గా మారడం కొత్తేమి కాకపోయి నా పవన్ కల్యాణ్కు మాత్రం అరుదైన గుర్తింపే అని చెప్పొచ్చు. దీంతో ఏ పీ కూటమి ప్రభుత్వ సారధుల పే ర్లు దేశ వ్యాప్తంగా మారు మోగుతు న్నాయి.తాజాగా శనివారం వెల్ల డైన ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో అ త్యధిక స్థానాలను సాధించి బీజేపీ చరిత్రను సృష్టించింది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ నియో జక వర్గాల్లో 48 స్థానాలను సాధిం చి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసు కుంది. అయితే ఈ విజయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్ర కూడా ఉంది. బాబు ప్రచారం చేసింది చాలా తక్కువ సమయమే అయినా తనదైన శైలిలో ప్రచారం సాగించారు. టెక్నాలజీ, ప్రపంచ దే శాల్లో భారత్ నాయకత్వం, మోదీ అనుసరిస్తున్న పాలనా మోడల్స్ కెజ్రివాల్ ప్రభుత్వం స్కామ్లు, ఢిల్లీ పొల్యుషన్, డ్రైనేజీ, తాగు నీరు, లిక్కర్ స్కాం వంటి పలు అంశా లపైన ఆయన ప్రచారం చేశారు.
ఇక్కడ బీజేపీకి అంత ప్రాధాన్యత లేదు. కెజ్రవాల్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు చంద్రబాబు ప్రచారం తోడు కావడంతో బీజేపీకి పట్టం కట్టారు. 32 ఏళ్ల తర్వాత ఇక్కడ బీజేపీ గెలిచింది. చంద్రబాబు ప్రచా రం ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజ క వర్గాల్లోని తెలుగు ప్రజలను ప్రభా వితం చేసింది. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునేందుకు ఇది కూడా ఉపయోగపడింది.గతంలో దేశ రా జకీయాల్లో ఓ వెలుగు వెలిగి.. కేంద్ర ప్రభుత్వాలను నిలబెట్టడంతో కీలక పాత్ర పోషించిన చంద్రబాబుకు ఈ సారి అదే స్థాయిలో మరో సారి ప్రా ధాన్యత పెరిగింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం నడవడానికి చంద్రబాబే కీలకంగా మారడంతో మరో సారి దేశ వ్యాప్తంగా చంద్రబాబు ఫేమస్ అయ్యారు. సీట్ల సర్దుబాట్లలో తన స్థాయిని తగ్గించుకొని, ఏపీలో కూ టమి అధికారంలోకి రావడానికి కీ రోల్ పోషించిన జనసేన అధ్యక్షు లు, ఉప ముఖ్యమంత్రి పవన్ క ల్యాణ్ ఒక్క సారిగా దేశ రాజకీ యాల్లో కీలకంగా మారి పోయారు. తనకు కేటాయించిన 21 సీట్లల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేటును సాధించి దేశ రాజకీయాలను తన వైపునకు తిప్పుకున్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక సనాతన ధర్మం, తిరుపతి తిరుమల లడ్డూ అంశాల్లో ఆయన తీసుకున్న స్టాం డ్ ఒక్క సారిగా దేశ రాజకీయాల్లో హీరోగా నిలబెట్టాయి. పవన్ కల్యా ణ్ శక్తి సామర్థ్యాలను గుర్తించిన మోదీ, అమిత్షాలు ఆయనకు ప్ర త్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నా రు. మరో సారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన చంద్రబాబును, ఏపీలో కూటమి నిలబడటానికి విశేష కృషి చేసిన పవన్ కల్యాణ్ను మహారాష్ట్ర ఎన్ని కల్లో ప్రచారం చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారం కోసం మహారా ష్ట్రకు వెళ్లినా సోదరుడు నారా రా మ్మూర్తి నాయుడు మృతి చెంద డంతో చంద్రబాబు ప్రచారానికి వెళ్ల లేకపోయారు.
ఈ నేపథ్యంలో ఎన్ని కల ప్రచారం బాధ్యతను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న పవన్ కల్యాణ్ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఏపీలో తన పార్టీకి కేటాయించిన 21 సీట్లను కైవసం చేసుకున్న విధంగానే మహారాష్ట్రలో కూడా సీన్ రిపీట్ చేశారు. బల్లాపూర్, చంద్రాపూర్, పూణెకంటోన్మెంట్, హడ్సర్పూర్, కస్సాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ వంటి నియోజక వర్గా ల్లో ప్రచారం చేసి మహాయుతి అభ్యర్థులను గెలిపించి, మహారా ష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిం చారు. అంతేకాకుండా మహారా ష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏ ర్పాటు కావడంలో కీలక భూమిక పోషించారు. ఇది అప్పట్లో ఓ సం చలనంగా మారింది.దీంతో ఏపీ కూ టమి ప్రభుత్వ రథ సారధులు సీ ఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ధ్వయం దేశ రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్లు గా మారారు. విజయానికి కీరాంగా మారి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచారు. విజయవాల పరంపర కొనసాగిస్తూ వీరద్దరి ధ్వయం దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధ్వయం అందనంత ఎత్తుకు తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.