Lokesh Guarantees: ప్రజా దీవెన అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ (Lokesh) విధానాల పట్ల పార్టీ కేడర్ లో హర్షం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వం పార్టీ కేడర్ పట్ల అనుసరించిన వేధింపుల విధానాన్ని పరిగణనలోకి తీసుకుని యువగళం పాదయాత్రలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రాంతాల వారీగా సమస్యల పరిష్కారానికి అక్కడి ప్రజలకు హామీ (Guarantees) ఇచ్చారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారు. దీనితో అటు ప్రజల్లోనూ ఇటు పార్టీ కేడర్‌లోనూ హర్షం వ్యక్తం అవుతుంది. అదే విధంగా పార్టీ కేడర్ ని వేధించిన వారిని, తమ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించిన వారిని, పార్టీ కార్యాలయంపై దాదులు చేసిన నాయకులను ఆయన మర్చిపోలేదు. వారందరిపై కేసులు తిరగ తోడించారు.
అప్పటి సంఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలితే వారిపై కేసులు నమోదు చేయడానికి, అరెస్టు చేయడానికి వెనుకంజ వేయలేదు. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh), మాజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh) లపై కేసులు నమోదు కావడం అరెస్టులు చేయడం కూడా జరిగింది. మిగిలిన వారిపై విచారణలు కొనసాగుతున్నాయి. కొందరు సుప్రీంకోర్టు వరకు వెళ్లి మధ్యంతర స్టేలు తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో ఇచ్చిన మరో హామీని ఈ నెల 17 నుంచి అమలులోకి తీసుకు వస్తున్నారు.
రాష్ట్ర పండగగా వాల్మీకి జయంది వాల్మీకి జయంతిని బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 17న వాల్మీకి జయంతి (Valmiki Jayanti) సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ జయంత్యోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే జయంత్యోత్సవాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత హాజరు కానున్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశిస్తూ అన్ని జిల్లాల బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్‌కు అప్పట్లో పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. బీసీల ఆత్మగౌరవానికి ప్రాముఖ్యతనిస్తూ, అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.