Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 6:39 am Posted by : prajadeveena.com

Mega Job Fair Held in Mangalagiri: మంగళగిరిలో నేడు మెగా జాబ్ మేళా

Mega Job Fair Held in Mangalagiri: మంగళగిరి నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మంగళగిరి పట్టణంలోని వీజే జూనియర్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతోంది.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేళా (Job Mela) సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. మొత్తం 950కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read: NEET Retest Fear Letter: నీట్ రీటెస్ట్ భయం.. విద్యార్థిని ఆవేదనతో రాసిన లేఖ వెలుగులోకి

10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులకు అర్హతలు, ఉద్యోగ స్వభావాన్ని బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం అందనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాన్ని పొందాలని మంగళగిరి యువత (Mangala Giri Youth)కు నిర్వాహకులు పిలుపునిచ్చారు.

అదనపు వివరాల కోసం 8074597926, 7780588993 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.