Mega Job Fair Held in Mangalagiri: మంగళగిరిలో నేడు మెగా జాబ్ మేళా

Mega Job Fair Held in Mangalagiri: మంగళగిరి నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మంగళగిరి పట్టణంలోని వీజే జూనియర్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేళా (Job Mela) సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి....