Minister Lokesh : ప్రజా దీవెన, సత్యసాయిజిల్లా: విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో పాల్గొ నేందుకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాల ప్రాంగణాని కి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుగా జూ నియర్ కళాశాల ప్రాంగణంలో రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పథకం కింద సాయం పొం దిన పి.మాధవి, ఆమె నలుగురు పిల్లలతో ముఖాముఖి నిర్వహిం చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కొత్త చెరువు బీసీ కాలనీకి చెందిన పి.మాధవికి ఎనిమిదో తరగతి చది వే బాలు, ఏడో తరగతి చదివే నర సమ్మ, ఐదో తరగతి చదివే బేబీ, మూడో తరగతి చదివే సన అనే న లుగురు పిల్లలు ఉన్నారు. మాధవి నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద రూ.52వేల సాయం అందింది. దీంతో పీటీఎం కార్యక్ర మంలో పాల్గొనేందుకు పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్ ముందగా తల్లి మాధవి, నలుగురు విద్యార్థుల తో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలో వసతులు ఎలా ఉన్నా యని ఆరా తీశారు. యూనిఫాం, మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తల్లి మాధవి మా ట్లాడుతూ తమకు తల్లికి వందనం పథకం కింద రూ.52వేల సాయం అందిందని, ఆ నగదును పిల్లల పే రుతో బ్యాంకులో డిపాజిట్ చేశామ ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పిల్లల ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని చె ప్పారు. పాఠశాలలో మధ్యాహ్న భో జనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు.
మధాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తు న్నామని, పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీ సుకువచ్చామని, వర్క్ బుక్ లు అందజేశామని ఈ సంద ర్భంగా మంత్రి వివరించారు. బాగా చదు వుకోవాలని, తల్లిదండ్రులను, ఉ పాధ్యాయులను గౌరవించాలని పిల్లలకు సూచించారు.తల్లికి వంద నం కింద నలుగురు పిల్లలకు సా యం అందించడంతో పాటు మంత్రి నారా లోకేష్ తమ పట్ల చూపించిన ఆపాయ్యత పట్ల మాధవి, విద్యార్థు లు ఆనందం వ్యక్తం చేశారు.