— ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి ఘన స్వాగతం
PM Narendra Modi : ప్రజా దీవెన, శ్రీశైలం: శ్రీశైలం భ్రమ రాంబ మల్లికార్జున స్వామివారిని మన నమో ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనంలో ప్రధాని తరించారు. ప్రా రంభంలో ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నం ది మండపం సర్కిల్ ద్వారా దేవాల య ప్రాంగణంలోని గంగాధర మం డపం వైపు చేరుకున్నారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్ర ధాన మంత్రికి విభూతి, కుంకుమ ధ రింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆ లయ అంతర్భాగానికి ఆహ్వానిం చారు. ప్రధాన మంత్రి ధ్వజస్తంభ న మస్కారం, శివ సంకల్పం అనంత రం రత్నగర్భ గణపతి పూజ నిర్వ హించారు.
ఆ తర్వాత మూలవిరాట్ శ్రీ మల్లి కార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏక వార రుద్రాభిషేకం, బిల్వార్చన, మ ల్లెపూల అర్చన, మహామంగళ హా రతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధల తో ప్రత్యేక పూజలు చేశారు. పూజ లు తర్వాత నందీశ్వర దర్శనం చే సుకున్నారు. అర్చకులు అందించిన స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీక రించారు. పూజలో భాగంగా ప్రధాన మంత్రి మోదీకి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలు ఆలయ పూజారులు అందించారు.
ప్రధాన మంత్రి శ్రీశైలాన్ని తొలిసారి దర్శించుకోవడం గమనార్హం. ఆల య మాడవీధుల్లో ఇరువైపులా ఉ న్న శివ సేవకులు, భక్తులకు కాన్వా య్ నుంచి అభివాదం చేస్తూ ప్రధా న మంత్రి ముందుకు సాగారు. శ్రీమ ల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాని కి ప్రధాన మంత్రి పంచామృతాలతో అ భిషేకం చేశారు. భ్రమరాంబ దేవికి ఖడ్గమాల కుంకుమార్చన నిర్వహిం చారు. పూజల తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రంలో 4 అడుగు ల ఎత్తైన కాంస్య విగ్రహానికి ప్రధాని నమస్కరించారు. ఛత్రపతి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను ప్రధాని తిలకించారు. ఛత్రపతి శివా జీకి శ్రీశైలంతో ఉన్న అనుబంధాన్ని అక్కడి నిర్వాహకులు ప్రధాన మం త్రికి వివరించారు. సుమారు 50 ని మిషాల పాటు భ్రమరాంబ మల్లికా ర్జున స్వామి సేవలో గడపారు.
ఆ తర్వాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సుమారు 40 నిమి షాల పాటు శివాజీ స్పూర్తి కేంద్రం ద్యాన మందిరంలో మోదీ గడుపు తారు. అనంతరం 1.30 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూ లు బహిరంగ సభకి బయలుదేరి వెళ్ళారు.
*ఎయిర్ పోర్టులో ఘన స్వాగ తం..* అంతకు ముందు కర్నూల్ లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నా రు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వా గతం పలికారు.