Prime Minister Narendra Modi : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సమయం ఆసన్నమైం ది. అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్స వానికి ప్రధాని పర్యట న షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులు ప్రధాని ప్రారం భించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి మే 2 తేదీన ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. పీఎం పర్యటనపై సీఎస్ కె. విజయానంద్ సమీక్ష నిర్వహిం చారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రధా ని సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. ప్రధాన వేదిక వద్ద 50 వేల మంది కూర్చునేలా, లక్ష మంది రో డ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగ తం పలికేందుకు, అలాగే మిగతా వారు వివిధ ప్రాంతాల్లో ఉండి వీక్షిం చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూ ల్: అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయిం ది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని ప్రారం భించనున్నారు. సచివాలయం వెన క బహిరంగసభ వేదికను ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడి నుంచే ప నుల పునఃప్రారంభోత్సవ కార్యక్ర మాన్ని ప్రధాని నిర్వహించను న్నా రు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.
వీఐపీలతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదార్లను గుర్తించామని, ఆయా రహదార్లలో ఎక్కడా ట్రాఫిక్ సమ స్య కలగకుండా తగిన తగిన చర్య లు తీసుకుంటామని సీఎస్ విజ యానంద్ అన్నారు. ఉమ్మడి కృ ష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి అధిక సం ఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించా రు. వేసవి దృష్ట్యా ప్రధాని పర్యట నకు వచ్చే ప్రజా ప్రతినిధులు, ప్ర జలు తదితరులెవరికీ ఎలాంటి అ సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చే యాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు.
అట్టహాసంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లు… అమరావతి పునర్ని ర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్ర మానికి పీఎం మోదీ రాష్ట్రానికి రా నున్న నేపథ్యం లో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాల యం వెనుక 250 ఎకరాల సువిశా ల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరు గుతున్నాయి. ప్రధాన వేదికను తూ ర్పు అభిముఖంగా ఉండేలా రెడీ చే స్తున్నారు. వర్షం పడినా కూడా ఇ బ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెం ట్లు వేయనున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయా లని అధికారులు భావిస్తున్నారు. వీఐపీ పార్కింగ్‌కు 10 ఎకరాలు, వేదికల కోసం 28 ఎకరాలు కేటా యించారు.
ప్రముఖుల కోసం 4 హెలీ ప్యాడ్లు…
ప్రధానితో పాటు ఇతర ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సచి వాలయం ఎదుట ముఖ్యమంత్రి ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొక టి రెడీ చేయాలని నిర్ణయించారు. రైతుల లే ఔట్‌లో నాలుగో హెలీ ప్యాడ్ రెడీ చేయాలని నిర్ణయించా రు. సభకు వచ్చేవారి కోసం 40 ఎక రాల్లో టెంట్లు వేయనున్నారు. ఎక రాకు 6 వేలు చొప్పున మొత్తం 2.4 0 లక్షల మంది కూర్చునేలా ఏర్పా ట్లు చేస్తున్నారు.
హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి ప్రధాని మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నా రు. సచివాలయం ఎదుట ఉన్న హెలీప్యాడ్లు, సభాప్రాంగణాన్ని ఇప్పటికే అధికారులు పరిశీలించా రు. రహదారి మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్తు తీగలను, చెట్లను వేరే చోటుకు మార్చనున్నారు. ట్రా ఫిక్ సమస్యలు తలెత్తకుండా చు ట్టూ ఉన్న రాజధాని రహదారుల ను తాత్కాలికంగా సిద్ధం చేయను న్నారు.