Road Accident :ప్రజా దీవెన, హిందూపురం: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదo చోటు చేసుకుంది. పరిగి మండలం ధనాపురం క్రాస్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా 11 మం ది కి గాయాలయ్యాయి.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను హిందూపురం ప్రభు త్వ ఆసుపత్రికి తరలించినట్లు పో లీసులు తెలిపారు. పోలీసుల కథ నం మేరకు రొద్దం మండలం దొడగ ట్ట గ్రామానికి చెందిన వారు ఆటో లో హిందూపురం సమీపంలోని కొ టిపి చౌడేశ్వరి దేవి ఆలయంను ద ర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో పరిగి సమీపంలోని ధనాపురం క్రాస్ వద్ద ఆటోను గుర్తు తెలియని వా హనం ఢీకొని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మరో మహిళ చికిత్స పొందుతూ కన్నుమూసింది.
మృతుల వివరాలు ఇలా ఉన్నా యి. సాకమ్మ, అలివేలమ్మ, ఆదిల క్ష్మమ్మవీరంతా ఒకే గ్రామం కు చెంది నవారు కాగా మరో 11 మందికి గా యాలైనట్లు సమాచారం. పూర్తి స మాచారం తెలియాల్సి వుంది. పరి గి పోలీసులు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.