Slbctunnel : ప్రజా దీవెన నల్లగొండ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదం విషయంలో ఉత్కం ఠత కొనసాగుతోంది. ఆ ఎనిమిది మందికి ఏమైం ది, సురక్షితంగా బయటకు వస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్త మవుతున్నా యి. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినప్పటికీ సహా యక, రక్షణ చర్యల్లో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చరంగ ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మంది ఇప్ప టివరకు అసలు బతికి ఉన్నారా లేదా అనే ప్రశ్నలు ప్రస్తుతం అందరి లోనూ అక్కడా ఇక్కడా తలెత్తుతున్నాయి.
ఇప్పటికే రెస్క్యూ టీమ్ తమ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగి స్తుండగా తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంఘటనస్థలికి చేరు కున్నారు. సొరంగంలోనే చిక్కుకున్న వారి కోసం వెళ్లిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చే సా యి. టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మే ర ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన ఎన్డిఆర్ ఎఫ్ బృందo మోకాలు లోతు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేక పోయాయి.
ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల పైన బురదతో నిండి పోయిం దని అధికారులు వెల్లడి స్తున్నారు.అధికారులు ఫ్లై కెమెరాతో ప్రమా దం జరిగిన దృశ్యా లను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సాంకే తిక మిషనరీతో లోపలికి వెళ్లాలని సమాలోచనలు చేస్తున్న అధికా రులు ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకా శం ఉంది. ఇదిలా ఉండగా సంఘటనస్థలికి చేరుకున్న హైదరాబాద్ టన్నెల్ వద్ద పరిస్థితిని పరిశీలించి అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలకు పలు సూచనలు చేస్తూ హైడ్రా వంతు సహా యంగా పాల్గొనేందుకు వచ్చారని తెలుస్తుంది.
కొనసాగుతోన్న ఉత్కంఠ… సొరంగ మార్గంలో చుట్టుకున్న ఆ ఎని మిది మందిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగ కొనసాగు తున్నప్ప టికీ ఏ సమయంలో ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం క్షణం క్షణం పెరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ 24 గంటల అనంతరం వరకు కూడా ఎస్ఎల్బీసీ సొరంగంలో 14 కిలో మీటర్ల వద్ద మట్టిలో ఇరుక్కుపోయిన వారు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఆ దేవుడు కరుణిస్తే వారు సజీవంగా వస్తారా, లేదం టే ఆశ వదులుకోవాల్సిందేనా అన్న రకరకాల అనుమానాలు వెళ్ళు వెతుతున్నాయి. ఈ క్రమంలో ఆయా విషయాలు అటు కుటుంబ సభ్యులకు, అధికార యంత్రాంగా నికి క్షణం క్షణం చేరవేస్తూ సంఘ టనా స్థలంలో ఉత్కంఠత మాత్రం కొనసాగుతోంది.
Slbc tunnel inner Damege at nagarkarnool pic.twitter.com/mbteZplrmv
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 23, 2025