–టీబీఎం మిషన్ కింద కార్మికుడి మృతదేహం లభ్యం
–మరో రెండు అక్కడే ఉండొచ్చని అంచనా
–మిగతా వాటికోసం కోసం తవ్వకాలు
–16 రోజుల గా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
–మృతదేహాలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు
ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో:
Srisailam Tunnel Rescue: ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగమార్గ ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది ఆచూకీ దాదాపు లభ్యమైంది. ప్రమాదంలో చిక్కు కున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ కోసం గడిచిన 16 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సొరంగం లోపల చివరి భాగంలో టీబీఎం మిషన్ కింద ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైందని రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. ఒక చేయి బయ టపడటంతో ఆ మృతదేహం బయటకు తీయడానికి మట్టిని తొలగిం చే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే ఈ సాయంత్రం వరకు మరో రెండు మృతదేహాల ఆచూకీ లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్ కి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో రెస్క్యూ బృందానికి ఒక కార్మికుడి మృతదేహం ఆనవాళ్లు కనిపించడంతో వెలికి తీస్తున్నారు. మరో రెండు మృతదేహాలు అక్కడే ఉండొచ్చని తవ్వకాలు జరుపుతున్నారు. అయితే అధికారులు మృతదేహం లభ్యమైన విషయాన్ని గోప్యంగా ఉంచారు.
ఇంకా బయటకు చెప్పడం లేదు. లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం ఒక మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసిన మృత దేహాలను అంబులెన్సుల ద్వారా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్సీ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాత్రి రెవెన్యూ అధికారులు నాగర్ కర్నూల్లో హాస్పిటల్ కు వెళ్లి అంబులెన్సులను, సిబ్బందిని అలర్ట్ చేశారు. ఆదివారం ఎప్పుడైనా మృతదేహాలు బయటకు వస్తాయని డాక్టర్లు, సిబ్బంది పేర్కొంటున్నారు.
అంబులెన్సులు రెడీగా ఉండాలని అప్రమత్తం చేశారు. టన్నెల్ లో పల భారీగా శిథిలాలు, మట్టి, బురద చేరడంతో పాటు మరో పక్క పెద్ద ఎత్తున ఊట నీరు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. మృతదేహాలను వెలిగితీ సేందుకు అధికారు లు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
క్యాడవర్ డాగ్స్ తో సత్ఫలితాలు…మట్టి తవ్వుతున్న క్రమంలో దుర్వాసన వస్తోందని అక్కడ పనిచేసేవారు చెబుతున్నారు. కేరళకు చెందిన రెండు క్యాడవర్డ్ డాగ్స్ తో స్క్వాడ్ బృందం టన్నెల్లోకి మ రోసారి లోపలికి వెళ్లారు. లోపల క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ఆధారంగా గుర్తించిన స్థలాల్లో తవ్వకాలు జరుపగా ఒక మృతదేహం లభ్యం కావడంతో మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించ డానికి మరోసారి క్యాడవర్ డాగ్స్ బృందం లోపలికి వెళ్లారు. ఒక మృత దేహం బయటపడటంతో సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తోంది అధికార యంత్రాంగం.