— ప్రజాప్రతినిధులు ఇకపై పోర్టల్ లోనే సిఫార్సు లేఖల అనుమతి
–పోర్టల్‌లో లేని లేఖలను టీటీడీ అంగీకరించదు
TTD : ప్రజా దీవెన, తిరుమల: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్ ఆవి ష్కరించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తెలంగాణ ప్రజాప్రతి నిధులు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇచ్చే సిఫా ర్సు లేఖల కోసం ప్రత్యేకంగా రూ పొందించిన పోర్టల్ ద్వారా లేఖలు పంపించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజాప్ర తినిధులు భక్తులకు ఇచ్చే విఐపి బ్రే క్ దర్శనం మరియు రూ. 300 ప్ర త్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించి న లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే స మర్పించాల్సి ఉంటుందని అధికారి కంగా ప్రకటించారు.
భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రజాప్రతి నిధులకు అందుబాటులోకి తీసు కువచ్చింది. ఇకపై ప్రజాప్రతినిధు లు ఈ పోర్టల్ ద్వారానే సిఫార్సు లేఖలను తయారు చేసి, వాటిని సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం భక్తులకు అసలు లేఖ ను అందజేయవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖ లకు ఒక ప్రత్యేకమైన సమర్థమైన విధానం నెలకొంటుందని అధికారు లు పేర్కొన్నారు.
ఈ పోర్టల్‌లో నమోదైన లేఖల వివ రాల ప్రకారమే టీటీడీ భక్తులకు ద ర్శన అనుమతులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. పోర్టల్ లో లేనికాని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించద ని తెలియజేశారు. ప్రజాప్రతినిధు లకు ఈ పోర్టల్‌ను ఎలా ఉపయో గించాలో వివరించే యూజర్ గైడ్ కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు మ రింత పారదర్శకంగా సేవలు అం దించేందుకు ప్రభుత్వం చర్యలు చే పట్టింది. తెలంగాణ రాష్ట్ర మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎం పీలు అందరూ ఈ కొత్త విధానాన్ని పాటించాలని ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి వేముల శ్రీనివాసులు విజ్ఞ ప్తి చేశారు.