YCP : ప్రజా దీవెన,అమరావతి: ఆంధ్రప్ర దేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభ్రుత్వం జాతీ య ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ పథకం లో జరిగిన అవినీతి అంతుతేల్చట మే తమ ప్రభుత్వం ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అ య్యిందని సభ్యులు అన్నారని అది గత ప్రభు త్వంలో జరిగిందని ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదట దృష్టి పెట్టింది ఉపాధి హా మీ పథకంలో జరిగిన అవకతవకల పైనే అని ఆయన అసెంబ్లీకి వివర ణ ఇచ్చారు.
గత ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చాయ న్నారు.అయినా సరే సో షల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వా లిటీ కంట్రో ల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్ప డినట్లు గుర్తించి ఆయనను తప్పిం చినట్లు తెలిపారు. రాష్ట్ర స్ధాయి ప్ల యింగ్ స్వ్కాడ్‌లతో మస్తర్ జాబి తాలు సరిగా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నామన్నారు.
అవినీతి వాస్తవమే….. రూ.2 50 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీలో జరిగిందని డిప్యూటీ సీ ఎం తెలిపారు. సాక్షాధారాలు లేక కేవలం రూ.74 కోట్లు మాత్రమే రిక వరీ అయ్యే అవకాశం ఉందన్నా రు. ఇప్పటికే రూ. 75 లక్షలు రికవరీ చేశామని, సంబంధిత అధికా రులపై చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. 31 మందిపై చర్య లు తీసుకున్నట్లు చెప్పారు. పనులు చేయ కుండానే చేసినట్లు రాసు కున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్విని యోగం జరిగినట్టు ఫిర్యాదు అందింది. ఇందు లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పో షించినట్టు తేలిందన్నారు.
వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశామన్నా రు. 25 మండలాలకు గాను 16 మండలా ల్లో అక్రమాలు జరిగా యి. వివిధ స్థాయిల వారి నుంచి దాదాపు 520 మందిని గుర్తిం చారు. అందు లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు ఉన్నట్లు తేలింద న్నారు. మిగతా వారిపై విచారణ జరుగుతోందన్నా రు. ప్రస్తుతం 52 6 మండలాల్లో సోషల్ ఆడిట్ చేశామన్నారు. మరి కొన్నింటిని ఈనె ల చివరి నాటికి పూర్తి కానుం దన్నారు. ఉపాధిహామీ పథకంలో అవి నీతి జరిగిందని సభ్యులు చెబుతున్నారని, అక్కడా ఆధారాలు లభించలేదన్నారు.
కొద్ది మొ త్తంలో నిధులు రికవరీ చేశా మన్నా రు. కొత్త జిల్లాలు రేషియాను బట్టి పరిశీలిస్తామన్నారు. జంగిల్స్ క్లియ రెన్స్ విష యంలో ముఖ్యమం త్రితో మాట్లాడతామని గుర్తు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో పలుమార్లు కేంద్రమంత్రులతో సమావేశ మైన విషయాన్ని గుర్తు చే శారు. జాతీయ ఉపాధి హామీలో సభ్యు లు అడిగినట్టు వేజెస్ పెంచ డం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీ ఆదాయ మార్గమైంది గత అయిదేళ్లుగా ఎన్ఆర్ఈజీఎ స్‌ను వైసీపీ ఆదాయ మార్గంగా మార్చుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పార్ధ సారథి ఆగ్రహం వ్యక్తం చేశా రు. చేసిన పనులు మరలా మరలా చూపించి పని చేయని వారిని కూ లీలుగా చూపించి డబ్బులు తీనేశా రని ఆరోపించారు. ఆదోనిలో సాక్షి విలేఖరి బందువులను మస్తర్‌లో రాసి వారికి పనికి వెళ్లకపోయినా బిల్లు చెల్లించారని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఇతర పార్టీల వారికి మస్తర్ ఇవ్వమని చెప్పారన్నారు. రాజకీయ ఉపాధి హమీ పథకమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పథ కం కాదు అనేలా మార్చేశారన్నారు.
ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెం ట్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడి కోట్లాది రూ పయలు అవినీతికి పాల్పడినట్టు సభ దృష్టికి తెచ్చారు. అలాగే జాబ్ కార్డు అవకతవకలు, సోషల్ ఆడిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అస లైన పేద వారికి పనులు లభించ డం లేదన్నారు.తిరువూరు ఎమ్మె ల్యే కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్నా రు. 42 మంది ఫీల్డ్ అసి స్టెంట్లు అవి నీతికి పాల్పడినట్టు ప్రజలు ఫిర్యా దు చేశారన్నారు. దీనిపై శాఖపర మైన విచారణ జరిపించాలని డి మాండ్ చేశారు.
స్పీకర్ రఘురామ రాజు మాట్లాడుతూ జిల్లాల విభ జన సమయం లో ఉపాధి హామీ పథకం పనులకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయన్నా రు. కొన్ని జిల్లాలకు ఎక్కువగా, మరికొన్నింటికి తక్కు వగా హామీ పనులు రావడం మొద లైందన్నారు. ఈ విషయంలో ప్రభు త్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు.