YSRCP : ప్రజా దీవెన,అమరావతి: ఆంధ్ర ప్ర దేశ్ లో వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి రో జు రోజుకు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా ఉంది. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ (వైసీపీ)కి ఇటీవల పలు వురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ స భ్యులు రాజీనామా చేయడం ఆ పార్టీకి తీవ్ర షాక్‌గా మారింది. తా జాగా పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వెలువడు తున్నాయి. రాజశేఖర్ 2019లో తన సీటును విడదల రజనీకి త్యాగం చేసి, ఎమ్మెల్సీగా నియ మితులయ్యారు. తాజా పరిణామా ల నేపథ్యంలో, రజనీని చిలకలూరి పేట సమన్వయకర్తగా నియమించ డం పట్ల ఆయన అసంతృప్తిగా ఉ న్నారు. అందువల్ల, ఆయన టీడీపీ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే, వైసీపీకి చెం దిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, సుంకర పద్మశ్రీలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, రా జ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. ఈ రాజీనామాల నేపథ్యం లో, వైసీపీ శాసనమండలిలో తన బలం కోల్పోతుంది. తాజాగా మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేస్తే, అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐ దుకు చేరుతుంది. ఇది పార్టీకి మ రింత ప్రతికూల పరిస్థితులను సృ ష్టించవచ్చు.