రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు సి ఎం కే సి ఆర్ ఘన స్వాగతం
ప్రజా దీవెన/ హైదారాబాద్:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నారు.హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఘన స్వాగతం పలికారు.సీఎం కేసీఆర్ గారి వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, మేడ్చల్ కలెక్టర్,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తదితరులు ఉన్నారు. అయితే హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్టప్రతి కి గవర్నర్ తమిళ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.గచ్చిబౌలి ఇండోర్ స్టేడియ స్టేడియం లో నేటి మధ్యాహ్నం జరిగే అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ముగింపు ఉత్సవాలకు రాష్టప్రతి గారితో కలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు పాల్గొననున్నారు.