సాయి చంద్ భార్య కు గుండె నొప్పి
ప్రజా దీవెన/హైదారాబాద్: గాయకుడు సాయి చందు భార్యకు కూడా గుండె నొప్పి వచ్చింది. గాయకుడు సాయి చందు మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఆమెకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సాయిచంద్ భార్యను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సాయి చందు భార్య రజిని తరలించినట్లు తెలుస్తోంది. అనంతరం వైద్యుల సూచనతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నారు సాయి చందు భార్య రజిని. కాగా గత వారం రోజుల కిందట గాయకుడు సాయిచంద్ గుండెపోటు కారణంగా మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.