MLC Elections: 14 మంది 15 సెట్ల నామినేషన్లు
వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5 వ రోజైన మంగళవారం14 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ప్రజా దీవెన నల్గొండ: వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5 వ రోజైన మంగళవారం14 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్,ఖమ్మం,నల్గొండ(Nalgonda) శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్. మహేందర్ జి కి వీరు నామినేషన్లను సమర్పించారు.
మంగళవారం నామినేషన్లు(Nominations) సమర్పించిన వారిలో బి ఆర్ ఎస్(BRS) పార్టీ నుండి ఎనుగుల రాకేష్ 1 సెట్, తెలంగాణ(Telangana) సకల జనుల పార్టీ నుండి నందిపాటి జానయ్య 1 సెట్, అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుండి ఈడ శేషగిరిరావు 1 సెట్, శ్రమజీవి పార్టీ నుండి జాజుల భాస్కర్ 1 సెట్ ,యువతరం పార్టీ నుండి బండారు నాగరాజు 1 సెట్, నామినేషన్లు దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్థులుగా అయితగోని రాఘవేంద్ర 1 సెట్, పిడిశెట్టి రాజు 2 సెట్ల నామినేషన్లు, పూజారి సత్యనారాయణ1 సెట్, మారం వెంకట్ రెడ్డి 1 సెట్, గుగులోతు బీమా 1 సెట్, డాక్టర్ పెంచాల శ్రీనివాస్ 1 సెట్, కంటే సాయన్న 1 సెట్, దైద సోమ సుందరం 1 సెట్, అల్వాల కనకరాజు 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
14 nominations in mlc elections