Alcohol lovers: ప్రజా దీవెన, హైదరాబాద్: మద్యం ప్రియులకు (Alcohol lovers)షాకింగ్ న్యూస్. ఓ విధంగా చెప్పాలంటే నిజంగా చేదువార్త ఎందుకంటే మద్యం ప్రియులకు (Alcohol lovers) చేదు అనుభవం ఎదు రైంది. అసలే వీకెండ్ శనివారం, ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మ ద్యం ప్రియులకు ఎలా ఉంటుంది. ఎన్నో ఆశలతో వీకెండ్ ఎంజాయ్ (Enjoy the weekend) చేద్దామనుకునేవాళ్లంతా ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోతారు.
కొందరైతే ఆదివారం సెలవైతే ముం దురోజే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు. అసలు మద్యం షాపులు ఆదివారం సెలవు ఎందు కు అనుకుంటున్నారేమో తెలంగాణ మొత్తం కాదండోయ్ కేవలం హైదరా బాద్ సిటీలోని (Hyderabad City) కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జులై 28 ఆదివారం మద్యం షాపులు మూత పడను న్నాయి. 24 గంటల పాటు వైన్స్ బంద్ అని పోలీసులు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మందు షాపులు తెరిచినా లేదా రహస్యంగా ఆ ప్రాంతాల్లో మందు విక్రయించినా చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికలు అయిపోయాయి కదామళ్లీ ఇప్పు డు వైన్స్ బంద్ ఏమిటను కుం టున్నారా మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సిటీలో జులై 28 ఉదయం ఆరుగంటల నుంచి 29వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివే యాలని హైదరాబాద్ పోలీసులు (Hyderabad polcie)ప్రకటించారు.
24 గంటల పాటు..
సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ (Chandrayana Gutta, Bandlaguda) వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొ ఘల్‌పురా, చత్రినాక, షాలి బండ, మీర్‌చౌక ప్రాంతాల్లో (Charminar, Kamatipura, Hussaini Alam, Falaknuma, Mughalpura, Chatrinaka, Shali Banda, Mirchowka areas) జులై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, మద్యం విక్రయించే సంస్థలు మూసి ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. భారీ ఎత్తున భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ క్రమంలో జులై 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో వైన్ షాపు లు పూర్తిగా మూసివేయను న్నారు.
పోలీసుల (police)ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరా బాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ (Excise Department)అధికారులు ప్రకటించారు. అలాగే ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి ఏదైనా ప్రదేశంలో విక్రయిం చినా నేరంగానే పరిగణి స్తామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసు లు సూచించారు.