Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bakrid: భక్తి శ్రద్ధలతో బక్రీద్

Bakrid

–ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
–పరస్పర బక్రీద్ శుభాకాంక్షలు
–రాష్ట్రoలోవెల్లువిరిసిన భక్తి భావం
Bakrid: హైదరాబాద్: తెలంగాణ (telangana) రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ (Bakrid) పర్వదినం ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపు కున్నారు. వేలాది మంది ముస్లింలు సంప్రదాయబద్ధంగా ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దా ఒకరికొకరు పరస్పరం పలకరించుకుంటూ ఆత్మీయ ఆలిం గనం చేసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని (hyderabad) చార్మి నార్ మసీద్, మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్, సెవెన్టూంబ్స్ పరిసర ప్రాంతా లు సందడి సందడిగా మారాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ముస్లిం ల కు బక్రీదుభాకాంక్షలు (bakrid wishes) తెలిపారు. వరంగల్ ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, నల్లగొండలో మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ప్రజాప్ర తినిధులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థ నలు చేశారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సీఈఆర్ క్లబ్ (CER Club) సమీ పంలోని ఈద్గాలో జరిగిన బక్రీద్ (bakrid) వే డుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎంప, ఎమ్మెల్యే లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకంక్షలు తెలిపారు. ఖురాన్ లో చెప్పిన విధంగాపేదలకు సహాయం అందించేందుకు ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యత తీసుకోవాలన్నారు. నిరుపేద ప్రజలకు మన సంపాదన లో ఒక శాతం కేటాయించి ఆదుకో వాలని ఖురాన్ లో ఉందని ఎమ్మె ల్యే గుర్తు చేశారు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీ య భావం వెల్లువిరిసింది. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించు కొని అశ్వారావుపేట ఈద్గా వద్ద ముస్లిం లు ప్రార్థనలు చేశారు. మువ్వన్నెల త్రివర్ణ పతాకం వస్త్రధారణ లు ధరించి దేశభక్తి భావాన్ని చాటి ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు.