Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: క్షమాపణ చెప్పాల్సిoది పోయి ఎదురుదాడా..!

–వారు తప్పించుకునేందుకు కాంగ్రె స్ ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు
–బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేపడతాం
–ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోపిడి చేసిన బిఆర్ఎస్ పాలకులు
–రూ. 75 వేల కోట్లతో మూడు నెల ల్లో లక్షన్నర ఎకరాలకు సాగునీరు స్తున్నాం
–ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రై తు రుణమాఫీ సంపూర్ణంగా అమ లు చేస్తాం.
–ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఆగస్టు 15న రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రాజీవ్ లింకు కెనాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం సభ
— ఆగస్టు 15 వైరా లో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి
–వైరా, స్నానాల లక్ష్మీపురం లో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రజా దీవెన, వైరా: బిఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో నిర్మాణం జరిగిన సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోవడంపై జరిగిన పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆ నెపం నుంచి తప్పించు కునేందుకు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభు త్వంపై  ఎదురు దాడి చేయడాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రంగా తప్పుపట్టారు. సుంకిశాలా ఘటన చూసిన తర్వాత  బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కృష్ణ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ (ktr)చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాలేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టుల్లో…. నీళ్లు రాకుండానే కాలేశ్వరం కుంగిపోగా, నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునుగడానికి గత పాలకుల అవినీతి పాపమేనని అన్నారు.‌ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డెత్ స్టోరేజ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే మరేం వస్తాయో కేటీఆర్ చెప్పాలన్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కట్టింది మీ ప్రభుత్వ హయాంలో కాదా? నాణ్యతగా నిర్మాణం జరిగితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా కెసిఆర్ సొంత నిర్ణయం తీసుకొని కట్టడం వల్లే మేడిగడ్డ కుంగి పోయిందన్నారు.

ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలి. కానీ, ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేయడం వలనే మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని డ్యామ్ సేఫ్టీ అధికారులు సైతం ధ్రువీకరించారని వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ప్రాజెక్టుల నాణ్యత లోపాలు,  అవినీతి ఎప్పుడు బయటపెట్టాలని చూసే మా ప్రభుత్వం సుంకిశాలా ఘటనను ఎందుకు దాచిపెడుతుందని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోపిడి చేసి ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం రూ. 1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి రూ. 23 వేల కోట్లకు అంచనాలు పెంచి సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు (Government water)ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ సరూర్నగర్ లో జరిగిన బహిరంగ సభలో సీతారామ ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీర్లతో సమీక్షించి  రాజీవ్ గాంధీ లింకు కెనాల్ ను ప్రతిపాదించామన్నారు. కేవలం 75 కోట్ల రూపాయలు తో రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. కేవలం మూడు నెలల్లోనే రాజీవ్ లింకు కెనాల్ కాలువను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.

ఆగస్టు 15న రుణమాఫీ సభకు వైరాకు సీఎం
ఆగస్టు 15 నాడు  రైతులకు  2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రజా ప్రభుత్వం ఖమ్మం జిల్లా వైరా వేదిక సాక్షిగా అమలు చేయనున్న నేపథ్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు హాజరవుతారని వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి  రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేస్తామన్న మాటకు కాంగ్రెస్ పార్టీ (Congress party) కట్టుబడి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజున రైతులను రుణ విముక్తులను  చేసే ఉన్నతమైన కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు విడతల్లో  16 లక్షల 29 వేల కుటుంబాలకు లక్షన్నర రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయడానికి వారి ఖాతాల్లో 12,298 కోట్ల రూపాయలను జమ చేశామన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని చేసిన సవాలు కు అనుగుణంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్కనైనా నేను పైసా పైసా పోగుచేసి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు.

గత జులై 15న రైతు రుణమాఫీ జీవోను విడుదల చేసి 18న మొదటి విడత రుణమాఫీ లక్ష రూపాయల వరకు అమలు చేశామన్నారు మొదటి విడతలో 11 లక్షల 50 వేల రైతుల ఖాతాల్లో 6989 కోట్ల రూపాయలు జమ చేశామని, పది లక్షల 84 వేల మంది రైతు కుటుంబాలకు (For farmer families)లబ్ది జరిగిందన్నారు. గత జులై లోనే అమలు చేసిన రెండో విడతలో 5,45,47 రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ అమలు చేయడానికి వారి ఖాతాల్లో 6,190.02 కోట్ల రూపాయలు నేరుగా జమ చేశామన్నారు.‌ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని పదేళ్లు అధికారంలో ఉండి రైతులను మోసం చేసిన బిఆర్ఎస్ పాలకులు రైతు పక్షపాతిమ అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నటి లేని విధంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం తొలిసారిగా వ్యవసాయ శాఖకు 72 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. అదేవిధంగా 1540 కోట్ల రూపాయలు రైతు బీమా ప్రీమియం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించిందన్నారు. పది సంవత్సరాల్లో ఎన్నడు కూడా పంట నష్టపరిహారం ఇవ్వకుండా రైతులకు పంట బీమా చేయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అధికారం లోకి రాగానే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని రైతులను కాపాడుకోవాలని ప్రజా ప్రభుత్వం పంటల బీమా కొరకు ఈ బడ్జెట్లో 1350 కోట్లు రూపాయలు కేటాయించిందని వివరించారు.