బైక్‌ను అతివేగంతో ఢీకొన్న కారు.. ఒకరు మృతి
ప్రజా దీవెన /కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు అతివేగంతో దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న అశోక్(34) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు దోమకొండ మండలం అంబారీపేట గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఫిరంగి రాజేశ్వర్‌కు చెందినదిగా గుర్తించారు.
మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లనే అశోక్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఫిరంగి రాజేశ్వర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు