KCR Nizamabad Road show: కేంద్రంలో సంకీర్ణమే..!
కేంద్రం లో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభు త్వం ఏర్పడడా నికే అవకాశం ఎక్కు వగా ఉందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
బిజేపీ, కాంగ్రెస్ లకు మెజారిటీ వచ్చే ప్రసక్తే లేదు
సబ్‌కా వికాస్ దేవుడెరుగు దేశం మాత్రం సర్వనాశనమైంది
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తుoదని ప్రజలు గుర్తించారు
రెండంకెల ఎంపి స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటాం
నిజామాబాద్ రోడ్‌షోలో బిఆర్‌ఎ స్ అధినేత కేసీఆర్
ప్రజా దీవెన, నిజామాబాద్: కేంద్రం లో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభు త్వం ఏర్పడడా నికే అవకాశం ఎక్కు వగా ఉందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జాతీయ స్థాయిలో పూర్తి మెజారిటీ రానే రాదని స్పష్టం చేశా రు. సోమవారం రాత్రి నిజామాబాద్ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ(Modi) చెబు తున్నట్లుగా బీజేపీకి 400 సీట్లు రావని 210 సీట్లు కూడా దాట వని జోస్యం చెప్పారు. కాంగ్రె స్‌కు కూడా అదే పరిస్థితి ఉందన్నారు.
దేశంలో బీజేపీ హవా తగ్గిపోయిం దని, ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రధాని పలు ప్రకటనలు చేస్తున్నా రని కేసీఆర్ దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లలో బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థులను గెలిపిస్తే.. కేంద్రంతో పోరాడి, రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి జరిగే విధంగా చూస్తా మని ఆయన హామీ ఇచ్చారు. మోదీ హయాంలో సబ్‌కా వికాస్ ఎక్కడా జరగలేదు సరికదా.. దేశం సత్తెనాశనం అయిపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ హయాంలో బాగా పెరిగాయని గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) గోదావరి నీటిని తమిళనాడుకు తీసుకువెళ్తానంటున్నారని.. అదే జరిగితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వెలిబుచ్చారు. మన గోదావరి, మన కృష్ణ నీళ్లు మనకే ఉండాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమ వుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ(BJP)ఎంపీలు గెలిచినా ఉపయోగం లేదని వారంతా మోదీ వద్ద చేతులు కట్టుకొని నిలబడతారే తప్ప రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క పనీ చేయలేరన్నారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రధానికి ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా ఒక్కటి కూడా ఇవ్వ లేదన్నారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని దుయ్య బట్టారు
. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు(Vote) వేయాలని నిలదీ శారు. మరోవైపు కాంగ్రెస్(Congress) నేతలు కూడా ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని, వచ్చాక ఒక్క గ్యారెంటీనీ అమలుచేయ లేదని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలల్లోనే కరెంటు కోతలు పెరిగాయని నిప్పులు చెరిగారు. ఈ ఐదు నెలల కాలంలో రైతులకు రైతుబంధు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. తాను రోడ్డు మీదకి వచ్చి సమావేశాల్లో పాల్గొనడంతోనే ఇప్పుడు రైతుబంధు చాలైందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ శక్తి, తెలంగాణ బలం బీఆర్‌ఎసేనని అన్నారు.
ఐదు ఎకరాలకంటే ఎక్కువ ఉంటే రైతుబంధు ఇవ్వబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారని.. ఎక్కువ భూమి ఉన్నోళ్లు ఏం తప్పు చేశారని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా చేశామని.. ఈ ఐదు నెలల పాలనలో ఎక్కడా ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో(Elections) హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడం లేద న్నారు. రాష్ట్రంలో రైతులందరి కీరూ.2 లక్షల రుణమాఫీ అయ్యేంతవరకూ బీఆర్‌ఎస్ గట్టిగా కొట్లాడుతుందని పేర్కొన్నారు. దేవుడిమీద ఒట్టు పెట్టుకోవడం, కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్‌కు ఏం తెలియదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
తాను ప్రాణాలకు తెగించి తెలంగాణ(Telangana) తెచ్చానని పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తాను మోదీని అన్ని విషయాల్లో వ్యతిరేకించాను కాబట్టే తన బిడ్డ కవితను(Kavitha) అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. అయినా కేసీఆర్ ఎప్పుడూ లొంగిపోడని, ఎవరికి లొంగడని,పోరాడుతూనే ఉంటాడ ని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ స్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజారిటీతో గెలిపించా లని కేసీఆర్ పిలుపునిచ్చారు.
BJP and Congress not get majority