–ఐదుగురు జవాన్ల దుర్మరణం
–సైనిక విన్యాసాల క్రమంలో సంభవించిన ప్రమాదం
–మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం
Boat accident: ప్రజాదీవెన, లడఖ్ : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో (ladak) సమీపంలో శనివారం (జూన్ 29న) ఘోర ప్రమాదం (Boat accident) జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డీ (Daulat Beg Oldie) ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు (Five jawans) వీరమరణం పొందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, LAC సమీపంలో నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటిమట్టం (water level) ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ నీటిలో చిక్కుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఐదుగురు ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నీటిలోంచి ఇప్పటి వరకు కొందరి మృతదేహాలను (Dead bodies) వెలికితీశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.